రాముడు మహేష్ కాదంట.. మరెవరు తేజ?

ప్రేక్షకులకు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇవ్వడమే తమ ఆలోచన అని అని పేర్కొన్నారు.;

Update: 2025-09-02 07:05 GMT

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ.. ఇప్పుడు మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్, ఫ్యాన్స్ లో మిరాయ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.

సూపర్ హీరో అడ్వెంచర్ థ్రిల్లర్ గా రానున్న మిరాయ్ ట్రైలర్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేయగా.. వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ట్రైలర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ట్రైలర్‌ లో కనిపించిన రాముడి పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు పోషించారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పుడు వాటిపై తేజ సజ్జా స్పందించి క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. మిరాయ్‌ లో మహేష్ బాబు నటించారన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టత ఇచ్చారు. ట్రైలర్‌ లో రాముడి పాత్రధారి ఎవరనేది ఉద్దేశపూర్వకంగానే సస్పెన్స్‌ గా ఉంచామని తెలిపారు. సర్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు.

ప్రేక్షకులకు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇవ్వడమే తమ ఆలోచన అని అని పేర్కొన్నారు. రాముడి రోల్ కోసం ఏఐ టెక్నాలజీని వాడారని వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. శ్రీరాముడిగా నటించింది ఎవరనే విషయం పై తాము ఇప్పుడే రివీల్ చేయలేమని కూడా తేజ సజ్జా తెలిపారు.

దీంతో మిరాయ్ లో శ్రీరాముడిగా ఎవరు కనిపిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. వారందరికీ థియేటర్స్ లోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా, యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సూపర్ హీరో మూవీగా మిరాయ్ ను తెరకెక్కిస్తుండగా.. యోధగా తేజ సందడి చేయనున్నారు.

హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తుండగా.. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. జగపతి బాబు, శ్రియా శరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. గౌర హరి సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. మరి రాముడిగా ఎవరు నటించారో వేచి చూడాలి.

Tags:    

Similar News