కపిల్ షో లో రెచ్చిపోయిన మిరాయ్ టీమ్

హ‌ను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ స‌జ్జ తాజాగా మిరాయ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు.;

Update: 2025-09-13 10:32 GMT

హ‌ను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ స‌జ్జ తాజాగా మిరాయ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. మిరాయ్ సినిమా ప్ర‌మోష‌న్స్ ను చిత్ర యూనిట్ చాలా భారీగానే ప్లాన్ చేసింది. అందులో భాగంగానే మిరాయ్ టీమ్ రీసెంట్ గా ది క‌పిల్ శ‌ర్మ షో లో క‌నిపించారు. ఈ షోలో తేజ సజ్జా, రితికా నాయ‌క్, శ్రియా శ‌రణ్, జ‌గ‌ప‌తి బాబు పాల్గొని సంద‌డి చేశారు.

ఆ షోలో వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌, ఫ‌న్, జోక్స్ ఆడియ‌న్స్ ను బాగా అల‌రించాయి. షో లో వారి మ‌ధ్య సంభాష‌ణ‌లు వింటుంటే షూటింగ్ చేసేట‌ప్పుడు వారంతా క‌లిసి ఎంత ఎంజాయ్ చేశారో అర్థమ‌వుతుంది. క‌పిల్ శ‌ర్మ షో లో వారు చేసిన సంద‌డి సినిమాపై అంద‌రికీ ఎగ్జైట్‌మెంట్ క‌లిగేలా చేసింది. ఈ షో లో తేజ చాలా ఫ్రెండ్లీగా జోకులేస్తూ స్పెష‌ల్ గా నిలిచారు.

నార్త్ లో తేజ‌కు మంచి ఫాలోయింగ్

హైద‌రాబాదీ యాస‌లో మాట్లాడి అంద‌రినీ ఇంప్రెస్ చేసిన తేజ‌కు ఈ మ‌ధ్య నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆ ఫాలోయింగ్ ను ఈ షో తో మ‌రింత పెంచుకునే ప్ర‌య‌త్నం చేశారు తేజ‌. ఇక శ్రియా, రితికా ఫ‌న్నీ స్కిట్స్ తో ఆడియ‌న్స్ ను అల‌రించగా, జ‌గ‌ప‌తి బాబు త‌నను చాలా కాలంగా చూస్తూ వ‌స్తున్న ప్రేక్ష‌కుల‌కు కూడా తెలియ‌ని త‌న టైమింగ్ తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

క‌పిల్ షో లో చిత్ర యూనిట్ సెట్స్ లో జ‌రిగిన ప‌లు విష‌యాల‌తో పాటూ కొన్ని ఫ‌న్నీ విష‌యాల‌ను కూడా షేర్ చేసుకోగా, అవ‌న్నీ ఈ షో లో మరింత హైలైట్ అయ్యి, మిరాయ్ పై ఆడియ‌న్స్ లో అంచ‌నాలు పెంచాయి. స్పెష‌ల్ ఎఫెక్ట్స్, యాక్ష‌న్ సీన్స్ కు వ‌ర్క్ చేయ‌డంలో ఉన్న స‌మ‌స్య‌ల‌తో పాటూ ఫ్యాన్స్ కు సినిమాలోని ఫాంట‌సీ, యాక్ష‌న్ భాగాల‌ను గొప్ప‌గా చూపించ‌డానికి వారు ప‌డే క‌ష్టాల గురించి కూడా మిరాయ్ టీమ్ ఈ షో లో చెప్పింది. మొత్తానికి ఈ షో త‌ర్వాత ఆడియ‌న్స్ కు మిరాయ్ పై ఉన్న ఆస‌క్తి ఇంకాస్త పెరిగింది.

Full View
Tags:    

Similar News