వండర్ ఉమెన్ రేంజు కటౌట్ ఎవరీ పాప?
ఆరడుగుల ఎత్తు.. తీర్చిదిద్దిన శిల్పం లాంటి దేహశిరులతో కొందరు నటీమణులు యువతరం మనసులపై బలమైన ముద్ర వేస్తుంటారు. టైటానిక్ క్యాట్ విన్ స్లెట్, వండర్ ఉమెన్ గాల్ గాడోట్ అలాంటి ముద్ర వేసారు. అదే కోవకు చెందుతుంది ఈ బ్యూటీ కూడా. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 తో ఈ పాశ్చాత్య నటి హృదయాలను గెలుచుకుంటోంది. భారతదేశం సహా దాదాపు 90 పైగా దేశాలలో స్ట్రేంజర్ థింగ్స్ 5 స్ట్రీమింగ్ అవుతుండగా , ప్రస్తుతం ఈ నటి ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
నెట్ ఫ్లిక్స్ స్ట్రేంజర్ థింగ్స్ ఫిఫ్త్ సీజన్లో లో ఇంకా కొన్ని ఎపిసోడ్స్ రావలిసి ఉంది . కానీ కాస్టింగ్ నుంచి మిల్లీ బాబీ బ్రౌన్ పేరు మార్మోగుతోంది. ఈ బ్యూటీ ఇన్ స్టా పోస్టులు నిరంతరం యువతరంలో హీట్ పెంచుతున్నాయి. ఎప్పుడూ బికినీ షూట్ లు, మ్యాగజైన్ కవర్ షూట్లతో చెలరేగిపోతోంది. పలు ఇంటర్వ్యూలతోను మిల్లీ బాబి బ్రౌన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక మిల్లీ బాబి బ్రౌన్ నేపథ్యం గురించి వెతికితే, 11వ సారి ఫాలన్ టునైట్‌కు కోహోస్టింగ్ చేస్తున్నట్లు తనే స్వయంగా తెలిపింది. మిలీ ప్రతిభ, కటౌట్ రెండూ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. అందువల్ల యూత్ కి కనెక్టవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇటీవలి కాలంలో వండర్ ఉమెన్ గా ప్రజల ముందుకు వచ్చిన ఇజ్రాయేలీ బ్యూటీ గాల్ గాడోట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువతరం హృదయాలను కొల్లగొట్టింది. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో అద్భుతమైన స్టంట్స్ చేస్తూ గాల్ గాడోట్ బలమైన ముద్ర వేసింది.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 లైవ్ కంప్లీట్ ఎపిసోడ్స్ వచ్చాక మిల్లీ పేరు మరింత మార్మోగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా క్వీన్ గా ప్రజల హృదయాలలో గిలిగింతలు పెడుతోంది. నటిగా కూడా తనదైన ముద్ర వేస్తే, భారీ పారితోషికాలు అందుకునే స్టార్ల జాబితాలో చేరిపోతుందని అంచనా వేస్తున్నారు. నేటితరంలో బ్యాక్ గ్రౌండ్ తో పని లేకుండా ప్రతిభను నిరూపించుకునేవారికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది మిల్లీ బ్రౌన్ కి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.