ఆర్ట్ కనెక్ట్ వెంచ‌ర్ తో ఆక‌ట్టుకున్న మిహీక‌

టాలీవుడ్ యాక్టర్, బిజినెస్ మ్యాన్ అయిన రానా ద‌గ్గుబాటి భార్య మిహీకా బ‌జాజ్ కూడా వ్యాపార వేత్త అనే సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-10-11 12:27 GMT

టాలీవుడ్ యాక్టర్, బిజినెస్ మ్యాన్ అయిన రానా ద‌గ్గుబాటి భార్య మిహీకా బ‌జాజ్ కూడా వ్యాపార వేత్త అనే సంగ‌తి తెలిసిందే. మిహీక తాజాగా త‌న స్పెష‌ల్ ఆర్ట్ క‌నెక్ట్ వెంచ‌ర్ తో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయ‌డ‌మే కాకుండా దాన్ని ఓ సెల‌బ్రేష‌న్ లాగా మార్చారు. ఇంటీరియ‌ర్ డిజైన‌ర్, ఆర్ట్ ల‌వ‌ర్, మెంట‌ల్ హెల్త్ అడ్వ‌కేట్ గా మ‌ల్టీ టాలెంట్స్ ఉన్న మిహీక రీసెంట్ గా హైద‌రాబాద్ లో ఓ పాప్ అప్ ను నిర్వ‌హించారు.

సంద‌డి చేసిన ప‌లువురు సెల‌బ్రిటీలు

ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోల‌ను మిహీక బ‌జాజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈవెంట్ కు వెంక‌టేష్, ఫ‌రియా అబ్దుల్లా, మంచు ల‌క్ష్మి, రానా తో పాటూ మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. మిహీక ఈవెంట్ కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ కొన్ని సాయంత్రాలు వెలుగుల ద్వారా మాత్ర‌మే కాకుండా కొంద‌రు వ్య‌క్తుల వ‌ల్ల కూడా ప్ర‌కాశిస్తాయని రాసుకొచ్చారు.

లూమ్/వ్యానాలో జ‌రిగిన ఈ ఆర్ట్ క‌నెక్ట్ ఈవెంట్ హైద‌రాబాద్ లోని ఆర్టిస్టులు, సెల‌బ్రిటీలను ఒక చోట చేర్చ‌గా, ఈ ఈవెంట్ లోని ప్ర‌తీ చోటూ ఓ కొత్త క‌థ‌ను మ‌రింత అందంగా, ట్రెడిష‌న‌ల్ గా చెప్ప‌బ‌డింద‌ని ఫోటోలు చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఈవెంట్ కు హాజ‌రైన వారిని కేవ‌లం ప‌రిశీల‌కులుగానే కాకుండా వారిని ఆర్ట్ లో భాగ‌మైన‌ట్టు భావించేలా చేయాల‌నే మిహీకా టార్గెట్, ప్ర‌తీ దాంట్లోనూ చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇక రానా విష‌యానికొస్తే, ర‌జినీకాంత్ తో క‌లిసి వేట్ట‌యాన్ మూవీలో న‌టించిన రానా ఆ సినిమాలో విల‌న్ గా న‌టించి మంచి మార్కులేసుకున్నారు. రీసెంట్ గా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మిరాయ్ లో కూడా రానా గెస్ట్ రోల్ లో న‌టించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా కూడా రాణిస్తున్న రానా, త్వ‌రలోనే కాంత సినిమాతో న‌టుడిగా, నిర్మాత‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ ఈవెంట్ విష‌యంలో రానా త‌న భార్య మిహీకాకు స‌పోర్ట్ గా నిల‌వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

Tags:    

Similar News