భారీగా పెరిగిన సత్య నాదెళ్ల జీతం.. ఎన్ని వందల కోట్లంటే?

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు అందుకోని అత్యధిక వార్షిక వేతనాన్ని అందుకోబోతున్నారు.;

Update: 2025-10-22 13:30 GMT

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు అందుకోని అత్యధిక వార్షిక వేతనాన్ని అందుకోబోతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి 96.5 మిలియన్లను జీతంగా తీసుకోబోతున్నారు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం.. 846 కోట్లు.. అంటే ఏడాదికి ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కలలో కూడా ఊహించని ఫిగర్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

గత సంవత్సరం ఆయన అందుకున్న వార్షిక జీతం 79.1 మిలియన్.. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 22 శాతం పెరిగింది. అంతేకాదు మైక్రోసాఫ్ట్ కంపెనీ బోర్డు మెంబర్లు సత్య నాదెళ్ల సీఈఓ బాధ్యత చేపట్టినప్పటి నుండి గత పదేళ్ల కాలంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని, నాదెళ్ల, ఆయన నాయకత్వం బృందాన్ని అభినందించారు. అంతేకాదు సత్యనాదెళ్ల వల్ల AI రంగంలో మైక్రోసాఫ్ట్ మరింత ముందుకు వెళ్లిందని కంపెనీ బోర్డు సభ్యులు పొగుడుతున్నారు..

అలా మైక్రోసాఫ్ట్ లో సత్యనాదెళ్ల అందించిన ప్రోత్సాహంతో, సేవలతో మైక్రోసాఫ్ట్ కంపెనీ లాభాల్లో దూసుకుపోయింది. జూన్ తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వృద్ధి లో దూసుకుపోవడంతో కంపెనీ షేర్లు సుమారు 23 శాతం లాభపడ్డాయి. ఈ సంవత్సరం ఎక్కువ భాగం అంటే 90 శాతం మైక్రోసాఫ్ట్ స్టాక్ నుండి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన శ్రమను గుర్తించి భారీ వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. 2014లో సత్య నాదెళ్ల జీతం 2.5 మిలియన్లుగా ఉంది. అలా సీఈఓ అయినప్పటి నుండి దశాబ్దకాలంగా సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీని సక్సెస్ఫుల్గా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వృద్ధి నుండి ప్రయోజనం పొందిన ఏకైక ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్ చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్ అమీ హుడ్ కూడా 29.5 మిలియన్లను జీతంగా అందుకున్నారు.. అలాగే కొత్తగా నియమితులైనటువంటి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్తాఫ్ కూడా 28.2 మిలియన్లు జీతం అందుకున్నారు..

సత్య నాదెళ్ల పరివారంలో పెరుగుదల మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర పెరుగుదలతో నేరుగా ముడిపడి ఉంది. 2025లో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 23% పెరిగాయి. అలాగే దాదాపు 15% రాబడిన S&P 500 సూచికను అధిగమించాయి కూడా.. గత మూడు సంవత్సరాలలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది.. ఇది కృత్రిమమేధ దశలోకి కంపెనీ దూకుడుగా ముందుకు సాగడంపై పెట్టుబడిదారుల విశ్వసాన్ని చెబుతోంది. అలా సీఈఓ అయినప్పటినుండి సత్యనాదెళ్ల ఈ ఏడాది అత్యధిక జీతం 96.5 మిలియన్లు అంటే దాదాపు 846 కోట్లు వార్షిక వేతనంగా అందుకోబోతున్నారు.. ఇప్పటివరకు ఆయన అందుకున్న అత్యధిక వేతన ప్యాకేజీలలో ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News