వరుణ్ తేజ్ పక్కన రితికా.. హైట్ డిబేట్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన డైరెక్ట‌ర్

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల జోడీని ఎంపిక చేసే సమయంలో యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు ఫిజికల్ అప్పియరెన్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది

Update: 2026-07-21 07:44 GMT

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల జోడీని ఎంపిక చేసే సమయంలో యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు ఫిజికల్ అప్పియరెన్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా ఆరడుగులకు పైగా హైట్ ఉన్న‌ హీరోల సరసన హీరోయిన్ సెలెక్ష‌న్ లో హైట్ ను కూడా కీలక అంశంగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు కోసం రితికా నాయక్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

వరుణ్ తేజ్‌తో పోలిస్తే రితికా హైట్ తక్కువగా ఉండటంతో, ఈ జోడీ స్క్రీన్‌పై ఎలా కనిపిస్తుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ డిస్క‌ష‌న్స్ అన్నింటికీ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ ఒక్క మాటతోనే దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. హీరోయిన్ సెలెక్ష‌న్ టైమ్ లో హైట్ గురించి తాన‌సలు ఆలోచించలేదని, ఆ క్యారెక్ట‌ర్‌కు రితికా మాత్రమే సరైన ఎంపికగా అనిపించిందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కామెంట్స్ చూస్తే డైరెక్ట‌ర్ కాస్టింగ్ ఫిలాసఫీ స్పష్టంగా అర్థమవుతోంది. కమర్షియల్ లెక్కలు, సోషల్ మీడియా అభిప్రాయాల కంటే కథకు ఎవరు న్యాయం చేస్తారన్నదే ఆయనకు ముఖ్యమ‌ని తెలుస్తోంది. హీరో పక్కన సాధారణంగా ఫిజికల్ మ్యాచింగ్‌ను లెక్క‌లోకి తీసుకునే టాలీవుడ్‌లో, పాత్రకు తగ్గ నటిని ఎంచుకోవడం కొంత రిస్క్‌గా కనిపించినా, అదే డైరెక్ట‌ర్ కాన్ఫిడెన్స్‌ను ప్రతిబింబిస్తోంది.

ఈ సినిమాలో కొరియన్ నేపథ్యం ఉండటం కూడా రితికా ఎంపికకు మరో కారణంగా చెప్పొచ్చు. రితికాకు కొరియన్ భాషపై మంచి అవగాహన ఉండటమే కాకుండా, కొరియా భాష మాట్లాడ‌టం కూడా తెలుస‌ని, రియ‌ల్ లైఫ్ లో రితికా వ్యక్తిత్వంలోని కొన్ని సహజ లక్షణాలనే సినిమాలోని పాత్రకు ఉపయోగించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆమె క్యారెక్ట‌ర్ సినిమాలో మరింత నేచుర‌ల్ గా క‌నిపించిందని గాంధీ తెలిపారు.

రీసెంట్ టైమ్స్ లో ఆడియ‌న్స్ కూడా గ్లామర్ కంటే పాత్రకు న్యాయం చేసే యాక్టింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి టైమ్ లో కొరియన్ కనకరాజు కాస్టింగ్ డెసిష‌న్ సంప్రదాయ ఫార్ములాకు భిన్నంగా ఉందనే చెప్పాలి. సోషల్ మీడియాలో హైట్ డిఫరెన్స్‌పై వచ్చిన అనుమానాల‌కు డైరెక్ట‌ర్ ఇచ్చిన సమాధానం తర్వాత ఇప్పుడు డిస్క‌ష‌న్ మొత్తం మరో దిశగా మారింది. స్క్రీన్‌పై ఈ జోడీ ఎలా కనిపిస్తారన్న ప్రశ్న కంటే, కథలో వారి కెమిస్ట్రీ ఎంత నేచుర‌ల్ గా వర్కౌట్ అవుతుందన్న ఆసక్తే ప్రేక్షకుల్లో పెరుగుతోంది. చివరికి ఈ రిస్కీగా కనిపించిన కాస్టింగ్ డెసిష‌న్ సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అన్నది రిలీజ్ తర్వాతే తేలనుంది.

Tags:    

Similar News