• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ లైనప్.. ఇంకా...

మెగాస్టార్ లైనప్.. ఇంకా ఎంతమంది బాసు?

| మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రెండు డిజాస్టర్ అయ్యాయి. రెండు ఎవరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-10-04 04:08 GMT

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రెండు డిజాస్టర్ అయ్యాయి. రెండు ఎవరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నుంచి మెగాస్టార్ మరింత కేర్ తీసుకుంటున్నారు. ఈ జెనరేషన్ తన నుంచి ఎలాంటి కథలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో మెగాస్టార్ చిరంజీవికి అర్ధమైంది.

దీంతో కంటెంట్ లో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. ఇక రీమేక్ ల జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యారంట. అందులో భాగంగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు స్టార్స్ దర్శకులతో కూడా కథల గురించి చర్చిస్తున్నారంట. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ కోసం ఒక స్టొరీ రెడీ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది.

అలాగే బోయపాటి శ్రీను మంచి పవర్ ఫుల్ మాస్ కథతో మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించాలని అనుకుంటున్నారంట. దీనికోసం స్టొరీ రెడీ చేసుకునే పనిలో బోయపాటి ఉన్నారని వినికిడి. ఇప్పుడు ఈ లైన్ లోకి సుకుమార్ కూడా వచ్చారంట. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో సుకుమార్ తో మూవీ చేయాలని అనుకుంటున్నారంట.

గాడ్ ఫాదర్ చిత్రానికి సుకుమార్ స్టైల్ లో ఒక వెర్షన్ కూడా అప్పట్లో రెడీ చేసారంట. అయితే ఇది ఎందుకనో సెట్ అవ్వలేదు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆగష్టుకి పుష్ప 2 రిలీజ్ అవ్వనుంది. తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద సుకుమార్ ఫోకస్ పెట్టనున్నారు. పుష్ప2 రిలీజ్ తర్వాత సుకుమార్ కి టైం దొరకనుంది.

సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కాని పుష్ప 2 రిలీజ్ తర్వాత బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో చరణ్ ఉంటారు. మరో ఆరు నెలలు దొరికే ఛాన్స్ ఉండదు. ఆ టైంని మెగాస్టార్ చిరంజీవి కోసం కేటాయించాలని అనుకుంటున్నారంట. ఒక మెగాస్టార్ కోసం ఒక మంచి కథని కూడా సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

మరి చిరంజీవి ఈ ముగ్గురు స్టార్ దర్శకులలో ఫస్ట్ ఛాయస్ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ కంటెంట్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తారు. బోయపాటి మాస్ జాతర చూపిస్తాడు. సుకుమార్ బలమైన కథతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ముగ్గురు కూడా మెగాస్టార్ లైన్ లో ఉన్నారని సమాచారం. ఫస్ట్ ఛాయస్ ఎవరికనేది ఇప్పట్లో చెప్పలేం.

Tags:    
  • Tollywood 
  • Megastar 
  • Chiranjeevi 
  • Movie 
  • Lineup 
  • Trivikram 
  • Boyapatisreenu 
  • Sukumar 
  • Stardirectors 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS