బాసిజమా? రౌడీయిజమా? గ్యాంగ్‌లీడర్ ట్రెండ్‌ను మళ్లీ తెస్తున్న మెగాస్టార్!
తెలుగు చిత్రసీమలో ``ట్రెండ్ మారినా.. టైమ్ మారినా.. స్టైల్ మాత్రం బాస్‌దే`` అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు.
తెలుగు చిత్రసీమలో ``ట్రెండ్ మారినా.. టైమ్ మారినా.. స్టైల్ మాత్రం బాస్‌దే`` అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు. ఆయన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. ఫ్యాన్స్- నెటిజన్లు ఆ ఫోటోషూట్‌ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. నల్లటి కొల్లార్డ్ టీ-షర్ట్.. లూజ్ ఫిట్ గ్రే డెనిమ్ జీన్స్.. వైట్ స్నీకర్స్‌తో పాటు కళ్లకు నల్లటి గాగుల్స్ ధరించి చిరు ఇచ్చిన ఈ పోజ్ చూస్తుంటే.. తొంబైల కాలం నాటి `రౌడీ అల్లుడు`, `గ్యాంగ్ లీడర్` రోజులటి మాస్ అండ్ క్లాసీ లుక్ మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైనట్లే అనిపిస్తోంది.
60 ఏళ్లు దాటినా కూడా చిరంజీవి మెయింటెనెన్స్ చూసి కుర్ర హీరోలు సైతం అసూయ పడేలా ఉన్నారు! వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని.. తనలోని గ్లామర్.. స్టైల్ ఐకాన్ ఇమేజ్ ఎప్పటికీ తగ్గదని ఆయన ఈ లుక్‌తో మరోసారి నిరూపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్.. ఫేషియల్ కట్... గడ్డం స్టైల్... చేతులు జేబులో పెట్టుకుని గోడకు ఆనుకుని నిలబడిన తీరు ప్రతీదీ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ అవుట్‌ఫిట్‌కి ఆయన ఎంచుకున్న బ్లాక్ సన్‌గ్లాసెస్- క్లాసీ రిస్ట్ వాచ్ ఆయన పర్సనాలిటీకి మరింత రాయల్ టచ్ ఇచ్చాయి.
డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో చిరు ఎప్పుడూ ట్రెండ్‌కి తగ్గట్టు అప్‌డేట్ అవుతుంటారు. డార్క్ పోలో షర్ట్‌కి కాంట్రాస్ట్ ఇచ్చేలా గ్రే షేడ్ లూజ్ డెనిమ్ వేసుకోవడం.. దానికి కాజువల్ వైట్ స్నీకర్స్ జత చేయడం ఆయనలోని యంగ్ ఫ్యాషన్ టేస్ట్‌ని ప్రతిబింబిస్తోంది. ఒకవైపు కుర్రకారు ఫాలో అయ్యే క్యాజువల్ స్ట్రీట్ స్టైల్ వైబ్‌ని ఇస్తూనే... మరోవైపు తనదైన పవర్‌ఫుల్ `బాస్` ఛరిష్మాను ఏమాత్రం తగ్గకుండా కాపాడుకోవడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమైంది.
అయితే సోషియో ఫాంటసీ - డివోషనల్ టచ్‌తో రాబోతున్న `విశ్వంభర` చిత్రంలోని లుక్‌కి ఈ ఫోటో పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. ఓ వైపు డివోషనల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న `విశ్వంభర`లో గంభీరమైన పాత్రలో కనిపిస్తూనే.. మరోవైపు రియల్ లైఫ్‌లో మాత్రం నేటికాలపు కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా క్యాజువల్ మోడర్న్ డ్రెస్సింగ్‌తో అలరిస్తున్నారు. `విశ్వంభర`లో కూడా మెగాస్టార్ పాత్ర అత్యంత యూత్‌ఫుల్‌గా.. శక్తివంతంగా ఉండబోతోందని సమాచారం.
ఏది ఏమైనా.. బాసిజమైనా.. రౌడీయిజమైనా అది ఒక్క మెగాస్టార్‌కే చెల్లుతుంది. తొంబైలలో ఎంతోమందిని తన డ్రెస్సింగ్ సెన్స్- హెయిర్‌స్టైల్స్‌తో ఇన్స్‌పైర్ చేసిన చిరంజీవి ఈ 2026లోనూ అదే స్టైల్‌తో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తున్నారు. ఆయనలోని ఈ ఎనర్జీ .. ఫ్యాషన్ సెన్స్ చూస్తుంటే మునుముందు ఆయన బాక్సాఫీస్ వద్ద చూపించబోయే మాస్ ఊచకోతకు ఇది జస్ట్ సాంపిల్ మాత్రమే అని అర్థమవుతోంది. చిరు నటించిన విశ్వంభర్ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే బాబి దర్శకత్వంలోను ఆయన ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.