అదే నిజమైతే పండగకి బ్లాస్టే!
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ పెళ్లి జీవితాల్లో చిక్కుకున్న అండర్ కవర్ ఏజెంట్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది.;
మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. చిరూ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్‌ప్రైజులిస్తూ ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ పలు ట్రీట్స్ ఇవ్వగా అందులో మెగా157 డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టింది. మెగా157 టైటిల్ ను చిరూ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు.
కీలక పాత్రలో వెంకటేష్
మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో పండగకి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ తో మెగా157 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కన్ఫర్మ్ చేశారు.
ఆల్రెడీ వెంకటేష్ తో మూడు సినిమాలు తీసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం మరో సారి వెంకీని డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆయన పాత్రకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఫలానా పాత్రలో వెంకీ కనిపించనున్నారు, ఆయన పాత్ర రన్ టైమ్ ఇంత అంటూ వార్తలు రాగా ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
అండర్ కవర్ ఏజెంట్లుగా..
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ పెళ్లి జీవితాల్లో చిక్కుకున్న అండర్ కవర్ ఏజెంట్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే వెంకీ క్యారెక్టర్ ఎఫ్2, ఎఫ్3 సినిమాల్లోని క్యారెక్టర్ అయుండొచ్చని కొందరంటున్నారు. ఆ రెండు సినిమాల్లో వెంకీ ఫ్రస్టేటెడ్ హస్బెండ్ పాత్రలోనే కనిపించి ఆడియన్స్ ను అలరించారు. ఇప్పుడు వెంకీకి చిరూ తోడవడం ఆడియన్స్ ను మరింత ఎగ్జైట్ చేస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.