ఆ రెండిటి మీదే మెగా ఫ్యాన్స్ గురి..!

చిరంజీవికి భోళా శంకర్, రామ్ చరణ్ కి గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ బ్రో, హరి హర వీరమల్లు ఇలా మెగా, పవర్ హీరోలంతా కూడా బాక్సాఫీస్ దగ్గర తమ పర్ఫార్మెన్స్ ని ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు.;

Update: 2025-08-18 12:30 GMT

చిరంజీవికి భోళా శంకర్, రామ్ చరణ్ కి గేమ్ ఛేంజర్, పవన్ కళ్యాణ్ బ్రో, హరి హర వీరమల్లు ఇలా మెగా, పవర్ హీరోలంతా కూడా బాక్సాఫీస్ దగ్గర తమ పర్ఫార్మెన్స్ ని ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు. రబఓతున్న సినిమాల మీదే మెగా ఫ్యాన్స్ తమ గురి పెట్టుకున్నారు. చిరంజీవి సినిమాల విషయంలో ఫ్యాన్స్ అటు ఇటుగా ఉన్నారు. రాబోతున్న విశ్వంభర మీద అసలేమాత్రం బజ్ లేదు. డైరెక్టర్ వశిష్ట వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది.

సుజిత్ ఒక రేంజ్ స్టైలిష్ గా..

ఐతే మెగా ఫ్యాన్స్ రాబోతున్న ఓజీ, పెద్ది సినిమాల మీదే తమ గురి పెట్టారు. ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సుజిత్ ఒక రేంజ్ స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ తోనే క్రేజీ అనిపించగా.. పవర్ స్టోర్మ్ సాంగ్ అయితే పీక్స్ అనిపించింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమాపైనే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది పై కూడా మెగా ఫ్యాన్స్ ఒక రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ బుచ్చి బాబు కాంబోలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో చరణ్ లుక్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. ఐతే ఈ మూవీ 2026 మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

పెద్ది ఫస్ట్ షాట్

పెద్ది నుంచి ఫస్ట్ షాట్ రాగా అది సినిమాపై హ్యూజ్ బజ్ పెంచింది. తప్పకుండా ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. చిరంజీవి నుంచి కూడా విశ్వంభర ఈ ఇయర్, నెక్స్ట్ సంక్రాంతికి మెగా 157 రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు.

మొత్తానికి మెగా హీరోలంతా కూడా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని సంతృప్తి పరచేందుకు వస్తున్నారు. ముందు ఓజీ ఆ తర్వాత విశ్వంభర ఆ నెక్స్ట్ మెగా 157 ఇక ఆ తర్వాత చరణ్ పెద్ది. ఇలా వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లు ఫ్యాన్స్ కి మెగా ఫీస్ట్ ఇచ్చేందుకు వస్తున్నాయి. ఈ సినిమాలతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News