సుశాంత్ తో మీనాక్షి పెళ్లి.. ఐదేళ్ల తర్వాత మీనాక్షి ఏమన్నారంటే?

మీనాక్షి చౌదరి.. 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ సొట్టబుగ్గల సుందరి.. తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంది;

Update: 2026-01-06 05:22 GMT

మీనాక్షి చౌదరి.. 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ సొట్టబుగ్గల సుందరి.. తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంది. 2024 సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసి సంక్రాంతి విజేతగా నిలిచిన ఈమె.. గత ఏడాది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా మళ్లీ సంక్రాంతి విజేతగా నిలిచి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

అందులో భాగంగానే తాజాగా నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది మీనాక్షి చౌదరి. అందులో భాగంగానే తన మొదటి సినిమా హీరో సుశాంత్ తో రిలేషన్ లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ గత ఐదు సంవత్సరాలుగా రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆ రూమర్స్ పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది మీనాక్షి చౌదరి.

ఇంటర్వ్యూలో భాగంగా.. సుశాంత్ తో మీనాక్షి చౌదరి పెళ్లి అని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ విషయంపై మీరు సుశాంత్ తో మాట్లాడారా? అని యాంకర్ ప్రశ్నించగా.. మొదట మీనాక్షి చౌదరి నవ్వేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.." నా మొదటి సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ సినిమాలో సుశాంత్ హీరోగా నటించారు. అప్పటి నుంచే నాకు సుశాంత్ తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక రూమర్స్ అంటారా సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. వీటిని చూసి చూడనట్టు వదిలేయాలి అంతేకానీ వీటినే పట్టుకొని వేలాడితే భవిష్యత్తులో ముందుకు వెళ్లలేము. ఇదే విషయాన్ని నేను సుశాంత్ తో చెబితే ఆయన కూడా ఇలాంటి రూమర్స్ గురించి పట్టించుకోవడం అంటే మన సమయాన్ని మనమే వృధా చేసుకోవడం అని చెప్పాడు అంటూ తెలిపింది.

అంతేకాదు ఇదే విషయంపై ఆమె ఇంకా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాక ఇవన్నీ సహజం. అందుకే వీటన్నింటినీ మైండ్ లోకి ఎక్కించుకొని స్ట్రెస్ తీసుకోవాలని అనుకోవట్లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా వినిపిస్తున్న రూమర్స్ కి ఒక్కసారిగా చెక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మీనాక్షి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా విషయానికొస్తే.. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. కళ్యాణ్ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్.తమన్ పనిచేస్తున్నారు.

Full View
Tags:    

Similar News