సైమా అవార్డ్స్ 2025: హాట్ ఫోజులతో స్పెషల్ అట్రాక్షన్ గా మీనాక్షి!
తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన SIIMA 2025 అవార్డ్స్ వేడుకలో ఎంతోమంది నటీనటులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.;
తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన SIIMA 2025 అవార్డ్స్ వేడుకలో ఎంతోమంది నటీనటులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే అందరిలోకెళ్లా స్పెషల్ అట్రాక్షన్ గా.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మీనాక్షి చౌదరి నిలిచింది. తాజాగా మీనాక్షికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది జనాలు దేవకన్యలా ఉంది అంటూ మీనాక్షి చౌదరి లుక్ పై పోస్టులు పెడుతున్నారు.. 2025 సైమా అవార్డ్స్ ఈవెంట్ దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది. 2024లో సౌత్ ఇండియాలో ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, సినిమాలకు సైమా అవార్డ్స్ అందించారు.
ఇందులో పుష్ప -2,కల్కి వంటి సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమాగా కల్కి 2898AD కి అవార్డు రాగా.. ఉత్తమ హీరోగా పుష్ప-2 లో నటించిన అల్లు అర్జున్ కి, ఉత్తమ హీరోయిన్ గా రష్మిక మందన్నాకి..ఉత్తమ దర్శకుడి కేటగిరీలో సుకుమార్ కి.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కి ఇలా ఏకంగా నాలుగు అవార్డులు పుష్ప-2 మూవీ యూనిట్ వాళ్లు సొంతం చేసుకున్నారు.. అయితే లక్కీ భాస్కర్ మూవీలో నటించిన మీనాక్షి చౌదరికి ఉత్తమ (క్రిటిక్స్ విభాగంలో) నటి అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకోవడం కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరి రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతేకాదు అవార్డు అందుకోవడం కోసం మీనాక్షి చౌదరి చాలా స్పెషల్ గా రెడీ అవ్వడంతో పాటు రెడ్ కార్పెట్ పై చాలా హుందాగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఎంతోమందిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సైమా అవార్డ్స్ లో అంత మంది హీరోయిన్లు పాల్గొన్నప్పటికీ అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మీనాక్షి చౌదరి నిలిచింది అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైట్ కలర్ డిజైనర్ బాడీ కాన్ గౌన్లో మీనాక్షి స్టన్నింగ్ లుక్స్ కి చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ డిజైనర్ డ్రెస్ లో ఆమె ఎద అందాలు ఎక్స్పోజ్ చేస్తూ చాలా గ్లామర్ గా కనిపించింది.
అలా రెడ్ కార్పెట్ పై మీనాక్షి చౌదరి నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు,వీడియోలు చూసిన నెటిజెన్లు వావ్ స్టన్నింగ్ బ్యూటీ.. వెరీ హాట్ అంటూ ఫైర్ ఎమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ చాలామంది మేడం సార్ మేడమ్ అంతే అంటూ ఫైర్ ఎమోజీస్ తో కూడిన పోస్టులు కూడా చేస్తున్నారు..
ప్రస్తుతం మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాతో భారీ హిట్ కొట్టింది. అలాగే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో 'అనగనగా ఒక రాజు' మూవీలో నటిస్తోంది.అంతేకాకుండా తాజాగా బాలీవుడ్ నుండి కూడా మీనాక్షికి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ అయినటువంటి ఫోర్స్ మూడో భాగంలో మీనాక్షిని హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.అలాగే ధనుష్ 55వ సినిమాలో కూడా మీనాక్షిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తమిళ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.