మారుతి డ్రీమ్ నెరవేరేనా?
తాను తన సినిమాల్లోని కొన్ని డైలాగులను షూటింగ్ కు వెళ్లాక ఫ్లో లో రాసేసుకుంటానని కూడా మారుతి చెప్పారు.;
ఈ రోజుల్లో మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన మారుతి, ఆ తర్వాత యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పలు సినిమాలతో సక్సెస్ ట్రాక్ లో కొనసాగిన మారుతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తున్నారంటే ఆయన స్థాయి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ది రాజా సాబ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రియల్ లైఫ్ నుంచే వాటిని డిజైన్ చేసుకుంటా
రోజురోజుకీ ఈ సినిమాకు హైప్ పెరుగుతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటూ, తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. తన సినిమాల్లోని క్యారెక్టర్లను తాను రియల్ లైఫ్ లోని ఇన్సిడెంట్స్ ను చూసే డిజైన్ చేసుకుంటానని చెప్పారు.
రాజా సాబ్ తో నా ఎనర్జీ ఏంటో తెలిసింది
తాను తన సినిమాల్లోని కొన్ని డైలాగులను షూటింగ్ కు వెళ్లాక ఫ్లో లో రాసేసుకుంటానని కూడా మారుతి చెప్పారు. రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ తనకు తన ఎనర్జీ ఏంటో తెలిసేలా చేశారని, ఈ ప్లాట్‌ఫామ్ ను తాను కచ్ఛితంగా ఉపయోగించుకుంటానని, ఎప్పుడైనా సరే తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తానని మారుతి స్పష్టం చేశారు.
ఐదుగురు స్టార్లతో మల్టీస్టారర్
ఇదే సందర్భంగా మారుతి తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచేలా చేశారు. పంచతంత్రం తరహా కథతో తానో భారీ మల్టీస్టారర్ ను తీయాలనుకుంటున్నానని, ఆ మూవీ రిలీజైన రోజు బాక్సాఫీస్ షేక్ అవాలనేది తన కోరికని చెప్పారు. ఆ మల్టీస్టారర్ లో తెలుగు ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునతో పాటూ కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ ను కూడా నటింపచేయాలనేది తన డ్రీమ్ అని, ఈ ఐదుగురు స్టార్లతో మల్టీస్టారర్ మూవీ చేసి ఇండస్ట్రీలో ఓ రికార్డుగా నిలవాలనేది తన ఆశగా మారుతి మనసులోని మాటను బయటపెట్టారు.
మారుతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ ప్రాజెక్టు అసలు పట్టాలెక్కుతుందా? మారుతి కోరిక నెరవేరుతుందా అనేది ప్రశ్నగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కానీ కన్ఫర్మ్ అయితే, నిజంగానే అది పాన్ ఇండియా స్థాయిలో భారీ మల్టీస్టారర్ గా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ రికార్డులు కూడా బ్రేక్ అవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.