మారుతి మల్టీస్టారర్ పంచతంత్రం.. జరిగే పనేనా..?
ప్రభాస్ తో రాజా సాబ్ తీసిన డైరెక్టర్ మారుతి టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటివరకు చూడని ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని అంటున్నాడు.;
ప్రభాస్ తో రాజా సాబ్ తీసిన డైరెక్టర్ మారుతి టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటివరకు చూడని ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని అంటున్నాడు. ఇంతకీ ఏంటా మల్టీస్టారర్ అందులో ఎవరెవరు ఉంటారంటే.. రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు మారుతి. ఈ క్రమంలో తనకు ఉన్న క్రేజీ మల్టీస్టారర్ ఆలోచనని బయట పెట్టారు. ఆయనకు పంచతంత్రం అనే సినిమా చేయాలని ఉందట.
మల్టీస్టారర్ తీస్తే అలా ఉండిపోవాలి..
అందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో పాటు కమల్ హాసన్ ని కూడా తీసుకుంటారట. వీళ్లందరికీ సరిపోయే కథ రాసేంత కెపాసిటీ ఉందని.. కంటెంట్ కూడా ఉందని అన్నారు మారుతి. ఐతే ఆ మల్టీస్టారర్ తీస్తే అలా ఉండిపోవాలి అంతే అని అన్నారు మారుతి. మారుతి చెప్పాడని కాదు కానీ తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు స్తంభాలైన చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
అలాంటి ఒక కథ రాస్తానని ఇప్పటివరకు ఎవరు ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ వాళ్లతో పాటు ఐదో స్టార్ ని యాడ్ చేస్తూ పంచతంత్రం సినిమా చేస్తానని మారుతి చెప్పడం సంథింగ్ క్రేజీగా అనిపిస్తుంది. మారుతి కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కాబట్టి అతను గట్టిగా అనుకోవాలే కానీ పంచతంత్రం మల్టీస్టారర్ షురూ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
పనిలో పనిగా పంచతంత్రం కథ కూడా..
ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేసిన మారుతి ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. రాజాసాబ్ హిట్ పడింది అంటే మాత్రం కచ్చితంగా మారుతికి మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పనిలో పనిగా పంచతంత్రం కథ కూడా కుదిరితే ఆయన చెప్పినట్టుగానే అలా ఒక మంచి క్లాసిక్ సినిమాగా ఉండిపోతుందని చెప్పొచ్చు.
ఇంతకీ మారుతి పంచతంత్రం కథ ఎలా ఉంటుంది. మన సీనియర్ స్టార్స్ ని ఎలా వాడుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో కమల్ హాసన్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం వెనక మారుతి ప్లాన్ ఏంటి. మారుతి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడని అనిపిస్తుంది. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునను కలిపి సినిమా చేయడం కుదరలేదు. మరి మారుతి కథకు మన స్టార్స్ ఓకే అంటారా.. నిజంగానే మారుతి పంచతంత్రం సినిమా ఉంటుందా లేదా అన్న డీటైల్స్ త్వరలో తెలుస్తుంది.
ఎలాగు వెంకటేష్ తో బాబు బంగారం సినిమా చేసిన మారుతి మంచి కథతో వెళ్తే స్తార్స్ ఓకే చెప్పే ఛాన్స్ ఉంటుంది. చిరు తో మారుతి క్లోజ్ గా ఉంటాడు. బాలకృష్ణ కూడా వాళ్ల ముగ్గురు చేస్తానంటే తాను సై అనేస్తారు. నాగార్జున ఎలాగు ప్రయోగాలకు సిద్ధం కాబట్టి పంచతంత్రం మల్టీస్టారర్ కి ఓకే చెప్పొచ్చు.