సన్నని బికినీలో మానుషి.. స్టన్ అయ్యేలా..

తెలుగు ప్రేక్షకులకు "ఆపరేషన్ వాలెంటైన్" సినిమాతో పరిచయం అయినా, ఈ సినిమా కూడా మంచి ఫలితాలను తీసుకురాలేకపోయింది.

Update: 2024-05-22 07:26 GMT

మానుషి చిల్లర్.. మోడలింగ్ ప్రపంచంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుని బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ హరియాణా బ్యూటీ, సినీ ప్రస్థానం మొదలుకొని ఇప్పటి వరకు మంచి సక్సెస్ ను అందుకోలేదు. గ్లామర్ ఫీల్డ్ లో అయితే అట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంది. మానుషి చిల్లర్, మిస్ వరల్డ్ కిరీటంతోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 17 సంవత్సరాల తర్వాత భారత్ నుంచి ఈ కిరీటం గెలుచుకున్న ఆమె, చరిత్రలోకి ఎక్కింది.

2022లో అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మానుషి, ఆ సినిమాలో భారీ ఫ్లాప్ ను ఎదుర్కొన్నారు. ఆ తరువాత "ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ" సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. తెలుగు ప్రేక్షకులకు "ఆపరేషన్ వాలెంటైన్" సినిమాతో పరిచయం అయినా, ఈ సినిమా కూడా మంచి ఫలితాలను తీసుకురాలేకపోయింది.

వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఈ చిత్రం, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ విధంగా, మానుషి తన నటనా ప్రస్థానంలో ఎక్కడా సరైన విజయం పొందలేకపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం మానుషి చిల్లర్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. స్టైలిష్ ఫోటోలతో, గ్లామర్ డోస్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలలో అమ్మడు బికినీ తో బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. మొన్నటివరకు ట్రెడిషనల్ మరియు మోడ్రన్ లుక్స్ లో సూపర్బ్ గా కనిపించిన ఈ బ్యూటీ మళ్ళీ చాలా గ్యాప్ తరువాత బికినీలో స్టన్ అయ్యేలా చేసింది. అలాగే చేతిలో కెమెరా పట్టుకొని ఉంది. త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ న్యూస్ షేర్ చేయనున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. మరి అమ్మడు ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందో చూడాలి.

Read more!

కెరీర్ పరంగా చూస్తే, మానుషి బిగ్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. "బడే మియాన్ చోటే మియాన్" సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లతో కలిసి నటించినప్పటికీ, ఈ చిత్రంలో కూడా మానుషి తన నటనతో ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోయింది. కెప్టెన్ మిషా పాత్రలో స్టైలిష్ గా కనిపించినా, ప్రేక్షకుల హృదయాలను దోచలేకపోయింది. ఇప్పటి వరకు ఆమె చేసిన నాలుగు చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో, మానుషి కెరీర్ పై ప్రశ్నార్ధకంగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈ విధంగా వైరల్ అవుతున్న, మానుషి తన తొలి హిట్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News