• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొడుకు పుట్టినరోజు...

కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్ జోష్

| మంచు ఫ్యామిలీలో మనోజ్ మంచు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్నాడు

By - Tupaki Desk
Update: 2023-08-02 04:12 GMT

మంచు ఫ్యామిలీలో మనోజ్ మంచు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ కంటెంట్ లతో మూవీస్ చేయడం మంచు మనోజ్ కి అలవాటు. అలాగే తన సినిమాలకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా కూడా ఎక్స్ ట్రా టాలెంట్ ని ఈ హీరో చూపిస్తూ ఉంటాడు.

మనోజ్ చివరిగా 2017లో ఒక్కడు మిగిలాడు మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. సినిమాని టైగర్ ప్రభాకరన్ కథతో తెరకెక్కించారు. అయితే కంటెంట్ పరంగా బాగున్నా ఎందుకనో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. దీంతో కమర్షియల్ ఈ సినిమా డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళిపోయింది.

ఇదిలా ఉంటే ఆ మధ్య కాలంలో అహం బ్రహ్మస్మి అనే సినిమాని మంచు మనోజ్ ఎనౌన్స్ చేసాడు. అయితే ఆ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ తర్వాత రీసెంట్ గా తన కొత్త సినిమా టైటిల్ ని కూడా మనోజ్ ఎనౌన్స్ చేశారు. వాట్ ది ఫిష్ అనే టైటిల్ తో క్రైమ్ కామెడీ కథాంశంతో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. ఈ చిత్రంతో వరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో భూమా మౌనిక రెడ్డిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ మూడ్ నుంచి బయటకొచ్చి చాలా రోజుల తర్వాత భూమా మౌనికతో ప్రేమలో పడటం. ఆపై తక్కువ మంది సన్నిహితుల మధ్యలో పెళ్లి చేసుకోవడం జరిగింది. మౌనికకి కూడా ఇది రెండో వివాహం. ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

అయితే మౌనిక కొడుకుని ఇప్పుడు మనోజ్ సొంతం కొడుకులా తండ్రి స్థానంలో ఉండి అన్ని చూసుకుంటున్నాడు. తాజాగా కొడుకు ధైరవ్ పుట్టినరోజు వేడుకలని మనోజ్ చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. డానికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకుని ఎత్తుకొని మరీ కేక్ కట్ చేయించాడు.

మౌనిక కంటే ఎక్కువ ప్రేమతో దగ్గరుండి ధైరవ్ తో కేక్ కట్ చేయించడమే కాకుండా అతనికి ఇష్టమైన విధంగా మొత్తం డెకరేషన్ చేయించారు. తాజాగా ఒక్క రోజు ముందు కొడుకుతో కలిసి మనోజ్, మౌనిక దంపతులు చంద్రబాబుని కలిసారు. ఈ సందర్భంగా తన కొడుకు ధైరవ్ బర్త్ డే సందర్భంగా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినట్లు చెప్పారు.

Tags:    
  • Manchumanoj 
  • Bhumamounikareddy 
  • Dhairavbirthday 
  • Manchufamily 
  • Mohanbabu 
  • Ahambrahmasmi 
  • Manojson 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS