మంగళవారం.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే?

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మంగళవారం.

Update: 2023-11-22 05:22 GMT

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మంగళవారం. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాకి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ప్రేక్షకాదరణ భాగానే ఉంది. మౌత్ టాక్ తో ఎక్కువగా జనాలకి రీచ్ అయ్యింది.

విరూపాక్ష తర్వాత ఆ తరహాలో కంప్లీట్ థ్రిల్లర్ గా ఈ వచ్చిన ఈ సినిమాని ఆడియన్స్ భాగా ఆశ్వాదిస్తున్నారు. చివరి 30 నిమిషాల ఎపిసోడ్ అయితే సీట్ ఎడ్జ్ న కూర్చొని చూసేలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ట్విస్ట్ లతో కథని అజయ్ భూపతి చెప్పడం విశేషం. పాయల్ రాజ్ పుత్ కి ఈ మూవీలో మరో డేరింగ్ రోల్ చేసి మెప్పించింది. తన పెర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇదిలా ఉంటే మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా 11.40 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. షేర్ పరంగా చూసుకుంటే 6.41 కోట్లు కలెక్ట్ అయ్యింది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 6.59 కోట్లు కలెక్ట్ చేయాలి. సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చేసిన ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో బ్రేక్ ఈవెన్ వెంటనే అందుకోలేదు. ప్రస్తుతం సినిమాకి పాజిటివ్ టాక్ నడుస్తోంది. డీసెంట్ కలెక్షన్స్ ప్రతి రోజు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ ఈ వీకెండ్ అయ్యేసరికి అందుకునే అవకాశం కనిపిస్తోంది. మరి లాంగ్ రన్ లో అజయ్ భూపతి ఈ థ్రిల్లర్ మంగళవారం ఏ మేరకు నిలబడి సక్సెస్ అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాయల్ రాజ్ పుత్ కి కూడా మంగళవారం సినిమా తర్వాత ఆఫర్స్ భాగానే పెరిగాయి. వాటిలో చాలా వరకు ఫిమేల్ సెంట్రిక్ కథలే వస్తూ ఉండటం విశేషం.

మంగళవారం సినిమా నిర్మాతలు అయితే ఇప్పటి వరకు సేఫ్ జోన్ లో ఉన్నారు. వారం రోజులు దాటితే డిస్టిబ్యూటర్స్ ఎంత వరకు రికవరీ అవుతారనేది తెలియాల్సి చూడాలి.

Tags:    

Similar News