అన్నదమ్ములిద్దరు ఒకేసారి పాన్ ఇండియా!
టాలీవుడ్ బ్రదర్స్ విష్ణు-మనోజ్ గురించి పరిచయం అవసరం లేదు. కెరీర్ లో ఇద్దరు ఇంకా పీక్స్ కే చేర లేదు.;
టాలీవుడ్ బ్రదర్స్ విష్ణు-మనోజ్ గురించి పరిచయం అవసరం లేదు. కెరీర్ లో ఇద్దరు ఇంకా పీక్స్ కే చేర లేదు. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్నారు. విష్ణు హీరోగా కంటున్యూ అవుతుంటే? మనోజ్ మాత్రం కెరీర్ లో కొత్త టర్నింగ్ కూడా తీసుకున్నాడు. హీరో పాత్రలే కాకుండా మంచి పాత్రలొస్తే చేయాలని డిసైడ్ అయి ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలో `మిరాయ్` అనే పాన్ ఇండియా చిత్రంలో ప్రతి నాయకుడిగా పాత్ర పోషిస్తున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన మనోజ్ గెటప్ సహా ఇతర ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చూ స్తుంటే మనోజ్ విలన్ గా క్లిక్ అయ్యేలా ఉన్నాడు. హీరో కంటే విలనిజం అతడిలో బాగా పండేలా కని పిస్తుంది. అతడి ఫిజిక్..వాయిస్ లో బేస్ లాంటి కొన్ని యూనిక్ క్వాలిటీలో మనోజ్ ను మంచి విలన్ ని చేసేలా ఉన్నాయి. `మిరాయ్` లో అతడి లుక్ చాలా ఇప్రెసివ్ గా ఉంది.
కొత్తగా ట్రై చేసిన లుక్ పై పాజిటివ్ సైన్ పడుతుంది. సినిమాపై పాన్ ఇండియాలో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ను ఎంత ప్రతిష్టాత్మకంగా భావించి చేసాడో చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రమిది. ఈసినిమాపై విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నాడు. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అన్న కాన్సెప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.
ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్లు కూడా సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇలా ఒకే ఏడాది అన్నదమ్ములిద్దరు పాన్ ఇండియాలో పరిచయం కావడం విశేషం ఇదే తొలిసారి. ఇంత వరకూ ఇద్దరు కూడా పాన్ ఇండియా చిత్రాలు చేయ లేదు. దీంతో ఈ ఏడాది అన్నదమ్ములిద్దరికి కలిసొస్తుందని ఆశిద్దాం.