కన్నప్పలో కనిపించమంటే తంతానంది!
ఈ విషయాన్నే రీసెంట్ ప్రెస్ మీట్ లో విష్ణు ని అడుగుతూ మంచు ఫ్యామిలీలోని మూడు జెనరేషన్లు ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారు కదా.;

మంచు విష్ణుకు ఓ మంచి హిట్ వచ్చి చాలా కాలమే అయింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు ఎన్నో ఏళ్లుగా వర్క్ చేసి ఇప్పుడు ఆ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు.
ఈ సినిమాలో వివిధ భాషల్లోని స్టార్లు నటించారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ శివునిగా నటించగా, మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటూ మోహన్ బాబు, కాజల్ లాంటి భారీ తారాగణమే నటించింది. ట్రైలర్ తో కన్నప్ప సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మంచు విష్ణు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కన్నప్ప సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ తో పాటూ విష్ణు పిల్లలు కూడా నటించారు. ముందుగా కన్నప్ప నుంచి అరియానా- వివియానా నటిస్తున్నట్లు ఓ పాట రిలీజ్ చేసి వెల్లడించిన టీమ్, ఆ తర్వాత విష్ణు కొడుకు అవ్రమ్ కూడా ఇందులో నటించారని ఆ పిల్లాడి షూటింగ్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి తెలిపారు. అంటే కన్నప్పలో మంచు ఫ్యామిలీలోని మూడు జెనరేషన్స్ యాక్ట్ చేశారన్నమాట.
ఈ విషయాన్నే రీసెంట్ ప్రెస్ మీట్ లో విష్ణు ని అడుగుతూ మంచు ఫ్యామిలీలోని మూడు జెనరేషన్లు ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారు కదా. ఈ సినిమాలో మొత్తం ఎంతమంది ఉన్నారని అడగ్గా, దానికి విష్ణు స్పందించారు. కన్నప్పలో తన ముగ్గురు కూతుళ్లతో పాటూ కొడుకు కూడా నటించాడని, తన చిన్న కూతురు కూడా ఈ సినిమాలో నటించిందని, షూటింగ్ టైమ్ లో తన వయసు రెండున్నరేళ్లు అని విష్ణు తెలిపారు.
అవ్రమ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నప్పుడు తన భార్య, చిన్న కూతురు సెట్ కి వచ్చారని, ఆ టైమ్ లో చిన్న పాపను కూడా ఓ సీన్ లో పెట్టమని డైరెక్టర్ చెప్పారని, సినిమాలో తను ఓ డైలాగ్ కూడా చెప్పిందని విష్ణు చెప్పారు. అందరూ ఉన్నాం నువ్వు ఒక్కదానివి మిస్ అవడం ఎందుకు జస్ట్ ఒక షాట్ లో కనిపించమని తన భార్యను అడిగితే తాను తంతానని చెప్పినట్టు విష్ణు సరదాగా చెప్పారు.