మోహన్ బాబు, మనోజ్.. ఇద్దరూ ఒకే మోడ్ లో ఉన్నారా?

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. రీసెంట్ గా మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-09-13 04:34 GMT

టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. రీసెంట్ గా మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోలుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన.. మధ్యలో పర్సనల్ రీజన్స్ వల్ల మూవీస్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు రీఎంట్రీలో ఓ రేంజ్ లో సందడి చేసేందుకు రెడీ అయినట్లు క్లియర్ గా కనిపిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం భైరవం మూవీలో కీలక పాత్ర పోషించిన మనోజ్.. ఆ సినిమాలో విలన్ గా కనిపించారు. కానీ ఆ మూవీ అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేదు. ఇప్పుడు మిరాయ్ లో విలన్ గా యాక్ట్ చేసి అదరగొట్టేశారు. ఆయన యాక్టింగ్ తోపాటు విలనిజానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

సినిమాలో మనోజ్ రోల్ స్క్రీన్ స్పేస్ మరీ అంత ఎక్కువ కానప్పటికీ.. ఉన్న వరకు మాత్రం తన యాక్టింగ్ తో అందరినీ కనెక్ట్ అయ్యారు. ఆయన క్యారెక్టరైజేషన్, గెటప్ అన్నీ సూపర్ గా ఉన్నాయని కొనియాడుతున్నారు. మొత్తానికి హీరో నుంచి విలన్ గా మారిన మనోజ్.. మిరాయ్ తో మాత్రం మంచి హిట్ ను దక్కించుకున్నారు.

అదే సమయంలో ఇప్పుడు మోహన్ బాబు కోసం చర్చ నడుస్తోంది. మిరాయ్ లో విలన్ గా మనోజ్ అదరగొట్టగా.. నేచురల్ స్టార్ నేని ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ విషయంపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటికీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు.

కానీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత మోహన్ బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే మోహన్ బాబు కూడా ఒకప్పుడు హీరోగానే కెరీర్ ను స్టార్ట్ చేశారు. తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు. అప్పట్లో హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు.

ఆ తర్వాత కెరీర్ మధ్యలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించారు. తనదైన యాక్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మధ్య తనకు స్టోరీ బాగా నచ్చితే ఓకే చెబుతున్నారు. రీసెంట్ గా కన్నప్పలోని కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ప్యారడైజ్ లో నటించనున్నారు! మరిన్ని సినిమాల కోసం చర్చలు జరుపుతున్నారట.

మనోజ్ కూడా పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటే విలన్ గా వరుసగా సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నారు. ఈ మేరకు పలు సినిమాల మేకర్స్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అటు తండ్రి.. ఇటు కొడుకు వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో కనిపించనున్నారన్న మాట. అదే జరిగితే మంచు ఫ్యాన్స్ కు సంతోషమే.

Tags:    

Similar News