ఆగిన ద‌గ్గ‌రే మొద‌లెట్ట‌నున్న మ‌నోజ్?

టాలీవుడ్ న‌టుల్లో ఒక‌రైన మంచు మ‌నోజ్ యాక్టింగ్ గురించి అంద‌రికీ తెలుసు. అయితే ఎంత మంచి యాక్ట‌ర్ల‌కైనా ఒక్కోసారి బ్యాడ్ ఫేజ్ ఉంటుంది.;

Update: 2025-09-16 11:30 GMT

టాలీవుడ్ న‌టుల్లో ఒక‌రైన మంచు మ‌నోజ్ యాక్టింగ్ గురించి అంద‌రికీ తెలుసు. అయితే ఎంత మంచి యాక్ట‌ర్ల‌కైనా ఒక్కోసారి బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. అలాంట‌ప్పుడు వారేం చేసినా క‌లిసిరాదు. మొన్న‌టివ‌ర‌కు మంచు మ‌నోజ్ కూడా దాదాపు అలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నారు. కానీ మిరాయ్ సినిమా మ‌నోజ్ కెరీర్ ను ఒక్క‌సారిగా మార్చేసింది. తేజ స‌జ్జా ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన మిరాయ్ లో మ‌నోజ్ కీల‌క పాత్ర చేయ‌గా, ఆ క్యారెక్ట‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది.

మిరాయ్‌తో కంబ్యాక్ ఇచ్చిన మ‌నోజ్

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మిరాయ్ సినిమా సెప్టెంబ‌ర్ 12న రిలీజ్ కాగా, ఫ‌స్ట్ షో నుంచే ఆ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. మిరాయ్ సినిమాతో మ‌నోజ్ మంచి కంబ్యాక్ అందుకున్నారు. సినిమాలో మ‌నోజ్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి ప్ర‌శంస‌లొస్తున్నాయి. గ‌త కొన్నేళ్లుగా మ‌నోజ్ రెండు మూడు సినిమాల‌ను అనౌన్స్ చేశారు.

రెమ్యూన‌రేష‌న్ ను పెంచేసిన మ‌నోజ్

సినిమాలైతే అనౌన్స్ చేశారు కానీ అందులో ఏవీ ఇప్ప‌టివ‌ర‌కు పూర్తైంది లేదు. మిరాయ్ స‌క్సెస్ త‌ర్వాత మ‌నోజ్ కెరీర్ ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఎలాంటి తొంద‌ర ప‌డ‌కుండా గ‌తంలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేస్తూ, కొత్త ప్రాజెక్టుల‌ను ఒక‌ప్పుకోవాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌నోజ్ త‌న రెమ్యూన‌రేష‌న్ ను కూడా పెంచార‌ని తెలుస్తోంది.

వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ బిజీ

నిర్మాత‌లు కూడా మిరాయ్ లో మ‌నోజ్ క్యారెక్ట‌ర్ చూసి అత‌నిపై ఇన్వెస్ట్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. గ‌తంలో అహం బ్ర‌హ్మాస్మి సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసిన మ‌నోజ్, ఇప్పుడా సినిమాను తిరిగి మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. ప్రీ పొడ‌క్ష‌న్ లో ఉన్న వాట్ ది ఫిష్ సినిమా కోసం డిస్క‌ష‌న్స్ జ‌రుపుతున్న మ‌నోజ్, కొత్త డైరెక్ట‌ర్ తో డేవిడ్ రెడ్డి అనే సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

మిరాయ్ లో బ్లాక్ స్వార్డ్ పాత్ర‌లో మ‌నోజ్ యాక్టింగ్ కు మంచి అప్లాజ్ వ‌చ్చాక, కేవ‌లం హీరోగానే కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేయ‌డానికి కూడా మ‌నోజ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో మ‌నోజ్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అవ‌డం ఖాయ‌మ‌నే అనిపిస్తుంది. త్వ‌ర‌లోనే మ‌నోజ్ చేయ‌బోయే త‌ర్వాతి ప్రాజెక్టుల‌కు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.

Tags:    

Similar News