మాల్దీవుల్లో మంచు లక్ష్మి గ్యాంగ్ రచ్చ.. బోట్​పై డ్యాన్స్ వైరల్!

ఈ వెకేషన్​లో మంచు లక్ష్మి గారితో పాటు స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, నటుడు జాకీ భగ్నానీ తదితరులు ఉన్నారు.;

Update: 2025-12-01 10:25 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటూ, తన లైఫ్ అప్​డేట్స్​ను అభిమానులతో పంచుకునే మంచు లక్ష్మి.. ప్రస్తుతం ఫుల్ వెకేషన్ మూడ్​లో ఉన్నారు. సినిమాలకు, షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇచ్చి తన క్లోజ్ ఫ్రెండ్స్​తో కలిసి మాల్దీవుల్లో వాలిపోయారు. అక్కడ ఈ సెలబ్రిటీ గ్యాంగ్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్​లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఈ వెకేషన్​లో మంచు లక్ష్మి గారితో పాటు స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, నటుడు జాకీ భగ్నానీ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి మాల్దీవుల్లోని ప్రముఖ లగ్జరీ రిసార్ట్ లో విడిది చేశారు. "మనసుకు నచ్చిన వాళ్లతో వెళ్లే ట్రిప్ ఇచ్చే హాయి మరెక్కడా దొరకదు" అంటూ లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ వారి మధ్య ఉన్న బాండింగ్​ను చూపిస్తోంది.

ఇక అక్కడ వీరు చేసే అల్లరి మామూలుగా లేదు. స్పీడ్ బోట్లపై సముద్రం మధ్యలోకి వెళ్లి షికార్లు కొడుతూ ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బోట్​పై అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో హీరోయిన్లంతా ఫుల్ జోష్​లో కనిపిస్తున్నారు. ఈ ట్రిప్​లో సెలబ్రిటీల అవుట్​ఫిట్స్ కూడా హైలైట్​గా నిలిచాయి.

నియాన్ గ్రీన్ కలర్ డ్రెస్​లో మంచు లక్ష్మి ఎంతో స్టైలిష్​గా, గ్లామరస్​గా కనిపిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ వైట్ డ్రెస్​లో మెరిసిపోతున్నారు. రకుల్ కూడా ట్రెండీ వేర్​లో ఆకట్టుకుంటున్నారు. సముద్ర తీరాన వీరి గ్లామర్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్​తో కలిసి రిఫ్రెష్ అవ్వడం మంచు లక్ష్మికి అలవాటు. ప్రస్తుతం ముంబైలో ఉంటూ కెరీర్​పై ఫోకస్ పెట్టిన ఆమె, ఇలాంటి వెకేషన్లతో లైఫ్​ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.



Tags:    

Similar News