విష్ణు అన్నా.. దిగొచ్చిన‌ మ‌నోజ్.. మ‌రి అన్న సంగ‌తేంటి?

మంచు కుటుంబ వివాదం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మంచు బ్ర‌ద‌ర్స్ విష్ణు- మ‌నోజ్ మ‌ధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానైంది.;

Update: 2025-08-18 04:56 GMT

మంచు కుటుంబ వివాదం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మంచు బ్ర‌ద‌ర్స్ విష్ణు- మ‌నోజ్ మ‌ధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానైంది. దానిని స్థానిక మీడియాల‌తో పాటు, అంత‌ర్జాతీయ మీడియా విస్త్ర‌తంగా క‌వ‌ర్ చేయ‌డంతో ఆ కుటుంబ వివాదం గురించి తెలుగు రాష్ట్రాలు స‌హా దేశం మొత్తం చ‌ర్చించుకుంది. అయితే ఒక కుటుంబ వివాదంలోకి మీడియా ప్ర‌వేశాన్ని త‌ట్టుకోలేని మంచు మోహ‌న్ బాబు ప్ర‌తిదాడి ఆ స‌మ‌యంలో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అన్న‌, నాన్న‌పైనా ప్రేమ ఉంది:

అదంతా అటుంచితే, ఇప్పుడు మంచు బ్ర‌ద‌ర్స్ ఒక‌ట‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంద‌నేది గుస‌గుస‌. ఇంత‌కుముందు `క‌న్న‌ప్ప` రిలీజ్ స‌మ‌యంలో త‌న సోద‌రుడు, తండ్రి స‌హా చిత్ర‌ బృందాన్ని మ‌నోజ్ అభినందించాడు. క‌న్న‌ప్ప‌కు విష్ణు స్వ‌యంగా నిర్మాత‌, క‌థానాయ‌కుడు కూడా. తాజాగా 'కన్నప్ప' సినిమాలో తన డెబ్యూ ప్ర‌ద‌ర్శ‌న‌కుగాను సంతోషం అవార్డు అందుకున్న విష్ణు కుమారుడు అవ్‌రామ్‌ను అభినందించి బాబాయ్ గా త‌న ప్రేమ‌ను మ‌నోజ్ చాటుకున్నాడు. ``అవ్రామ్ నిన్ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది.. నీకు అభినంద‌నలు.. ఇలానే షైన్ అవ్వు నాన్నా.. విష్ణు అన్న‌, నాన్న గారు కూడా ఈ అవార్డును అందుకోవ‌డం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది... మీపై చాలా ప్రేమ ఉంది!`` అని ఎక్స్ ఖాతాలో మ‌నోజ్ పోస్ట్ చేసాడు. త‌న అన్న కుమారుడిపైనే కాదు, అన్న‌గారు, తండ్రిపైనా మ‌నోజ్ త‌న ప్రేమ‌ను దాచుకోక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

బెట్టు నెమ్మ‌దిగా వీడారు:

క‌న్న‌ప్ప రిలీజ్ కి ముందు కొంత బెట్టు ఉంది. అన్న‌ విష్ణు పేరు ప్ర‌స్థావించ‌కుండా చిత్ర‌బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మ‌నోజ్ త‌న స‌మీక్షా స‌మ‌యంలోను అన్న‌పేరును ప్ర‌స్థావించ‌లేదు. ఇంకా బెట్టు వీడ‌లేద‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు టెర్మ్స్ మారాయి. టెర్మినాల‌జీ మారుతోంది. విష్ణు అన్నా అని మ‌నోజ్ ఆప్యాయంగా పిలుస్తున్నాడు. ప‌ల‌కరింపు బావుంది.. పిలుపులో ప్రేమ క‌నిపిస్తోంది. ఇది కచ్ఛితంగా క‌లిసిపోయేందుకు ఆహ్వానం. అటువైపు బెట్టు లేక‌పోతే ఇదే స‌రైన స‌మ‌యం అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ స‌మ‌యంలో విష్ణు ఒక మెట్టు దిగి వ‌స్తే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య తిరిగి పాత బంధం పున‌రుద్ధ‌రించ‌బ‌డుతుంది.

గొడ‌వ దేనికి మొద‌లైంది?

అస‌లు ఇంత‌కీ అన్న‌ద‌మ్ముల గొడ‌వ దేనికి? అంటే.. దానిపై ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు క్లారిటీ లేదు. అన్న‌ద‌మ్ములు ఆస్తికోసం కొట్లాడుకున్నార‌ని కొంద‌రు ప్ర‌చారం చేసారు. మ‌రికొంద‌రు ఇవ‌న్నీ కేవ‌లం ఈగో గొడ‌వ‌లేన‌ని కొట్టి పారేసారు. కుటుంబంలో అన్న విష్ణుకు ఇచ్చిన ప్రాధాన్య‌త మ‌నోజ్ కి లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అత‌డు తిరుగుబాటు చేసాడ‌ని కొన్ని మీడియాలు క‌థ‌లు అల్లాయి. కానీ దేనిపైనా స‌రైన క్లారిటీ లేదు.

అన్న‌ద‌మ్ముల‌ను క‌లిపేది ఈయ‌నే:

ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో మంచు బ్ర‌ద‌ర్స్ ని క‌లిపే బాధ్య‌త తాను తీసుకుంటున్నాన‌ని అన్నారు ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా. ఈ వెట‌ర‌న్ తాను అన్న మాట‌ల్ని నిల‌బెట్టుకోవాల్సి ఉంటుంది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వివాదం గాలివాన‌లా అప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చి పోయేది. బెట్టు చేయ‌డం ఆపి, ప‌ట్టు విడుపు ఉన్న‌ప్పుడు బ్ర‌ద‌ర్స్ ని క‌లిపేస్తే స‌రి. కీల‌క స‌మ‌యంలో మంచు కుటుంబ స‌న్నిహితుడు అయిన త‌మ్మారెడ్డి ఆ రోల్ స‌వ్యంగా పోషిస్తారా లేదా? చూడాలి.

Tags:    

Similar News