రాజసాబ్ లాంటి ఇబ్బందులు రాకుండా.. మెగా ప్లాన్
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే రిలీజ్ కి ముందు రకరకాల టెన్షన్లు ఉంటాయి. టికెట్ రేట్లు, పర్మిషన్లు, షో టైమింగ్స్ ఇలా చాలా విషయాలు చివరి నిమిషంలో గందరగోళం సృష్టిస్తుంటాయి.;
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కి సమయం దగ్గరపడుతోంది. జనవరి 12న వస్తున్న ఈ సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి సీజన్ కు సెట్టయ్యే కంటెంట్ తో సిద్ధమవుతోంది. మెగాస్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా హుక్ స్టెప్ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్ల వద్ద మెగా మాస్ జాతర ఖాయమనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మరోసారి చిరు మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే రిలీజ్ కి ముందు రకరకాల టెన్షన్లు ఉంటాయి. టికెట్ రేట్లు, పర్మిషన్లు, షో టైమింగ్స్ ఇలా చాలా విషయాలు చివరి నిమిషంలో గందరగోళం సృష్టిస్తుంటాయి. ఇటీవలే ది రాజాసాబ్ సినిమా విషయంలో కూడా అభిమానులు ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. రిలీజ్ కి కొద్ది గంటల ముందు వరకు క్లారిటీ లేకపోవడంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన నెలకొంది.
అయితే ఈసారి మెగాస్టార్ సినిమా విషయంలో నిర్మాత సాహు గారపాటి చాలా అలర్ట్ గా ఉన్నారు. వేరే సినిమాల విషయంలో జరిగిన తప్పులు ఇక్కడ జరగకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ సాఫీగా సాగేలా ప్లాన్ చేస్తున్నారు. చివరి నిమిషంలో హడావుడి పడకుండా అన్నీ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రొడక్షన్ టీమ్ చేస్తున్న ఈ గ్రౌండ్ వర్క్ ఇప్పుడు ఫ్యాన్స్ కి పెద్ద రిలీఫ్ ఇస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం నుంచి పెయిడ్ ప్రీమియర్స్ కి సంబంధించి సానుకూల స్పందన వస్తోంది. 500 రూపాయల టికెట్ ధరతో షోలు వేసేందుకు ఉత్తర్వులు ఈరోజే వచ్చే అవకాశం ఉంది. ఇది ఖరారైన వెంటనే బుకింగ్స్ ఓపెన్ చేస్తారని తెలుస్తోంది. రాజా సాబ్ లాంటి సినిమాలకి జరిగినట్లు కాకుండా ఇక్కడ ప్రతిదీ ముందే క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా టికెట్లు దొరికే ఛాన్స్ ఉంది.
ఇక సినిమాలో మరో పెద్ద సర్ ప్రైజ్ కూడా దాగుంది. ఇప్పటికే హిట్ అయిన హుక్ స్టెప్ సాంగ్ ని మించిపోయేలా ఒక స్పెషల్ సాంగ్ ని అనిల్ రావిపూడి డిజైన్ చేశారు. ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా నేరుగా థియేటర్లోనే చూపించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ప్రమోషన్ల హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చే ఈ ఎలిమెంట్ థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం గ్యారెంటీ.
ఏదేమైనా మన శంకర వరప్రసాద్ గారు సినిమా చుట్టూ ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అటు పక్కా ప్లానింగ్ అలాగే ఇటు క్రేజీ కంటెంట్ తో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమనిపిస్తోంది. ఇక మెగా విక్టరీ కాంబో కూడా ఈ సినిమాలో స్పెషల్ గా హైలెట్ కానుంది. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ ని అనిల్ రావిపూడి ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి.