మెగా బాస్ శశిరేఖ సాంగ్.. గ్రేస్ అదిరింది..!
సూపర్ హిట్ మెలోడీగా మీసాల పిల్ల సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా నుంచి రెండో సాంగ్ గా శశిరేఖ సాంగ్ లేటెస్ట్ గా రిలీజైంది.;
మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజైంది. షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. 2026 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా వచ్చిన మీసాల పిల్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
మీసాల పిల్ల తర్వాత శశిరేఖ సాంగ్..
సూపర్ హిట్ మెలోడీగా మీసాల పిల్ల సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా నుంచి రెండో సాంగ్ గా శశిరేఖ సాంగ్ లేటెస్ట్ గా రిలీజైంది. భీంస్ నుంచి మరో బ్యూటిఫుల్ కంపోజింగ్ తో ఈ సాంగ్ వచ్చింది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ సాంగ్ ని భీమ్స్, మధుప్రియ ఆలపించారు. సాంగ్ కి తగినట్టుగా చిరు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ నయనతార లుక్స్ ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా సాంగ్ లో అలా మెగాస్టార్ చిరంజీవి గుర్రాన్ని పట్టుకుని అలా నడిచి వచ్చే షాట్ అయితే మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కేలా చేస్తుందని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే తోనే కాదు మెగాస్టార్ మెగా వింటేజ్ వైబ్ ని సాంగ్స్ తో కూడా చూపించేలా ఉన్నాడు. మెగా బాస్ మన శంకర వరప్రసాద్ నుంచి రెండో సాంగ్ శశిరేఖా సాంగ్ అయితే ఆడియన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది. సాంగ్ లో చిరంజీవి కలర్ ఫుల్ డ్రెస్ లు మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాయి.
టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా..
మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా సినిమాలోని సాంగ్స్ కూడా క్రేజీగా మారాయి. మీసాల పిల్ల సినిమా సాంగ్ తో ట్రెండింగ్ లో ఉన్న మన శంకర వరప్రసాద్ నుంచి రెండో సాంగ్ గా శశిరేఖా కు కూడా రెస్పాన్స్ బాగుండేలా ఉంది. అనిల్ రావిపూడి సూపర్ హిట్ మేనియాని కొనసాగించేలా మన శంకర వరప్రసాద్ వస్తున్నాడని చెప్పొచ్చు. సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అటు ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇవ్వబోతుందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక స్పెషల్ క్యామియో చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఒక సాంగ్ కూడా చేస్తున్నారని టాక్. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సాంగ్స్ తో టాప్ ట్రెండింగ్ కొనసాగిస్తుంది. సంక్రాంతికి పోటీగా స్టార్ సినిమాలు వస్తుండగా శంకర వరప్రసాద్ డామినేషన్ చూపించేలా మంచి స్టఫ్ తో రాబోతుంది. అనిల్ రావిపూడి కూడా ఈ మూవీ విషయంలో మెగా ప్లాన్ తో వస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.