స్టేజ్ పై అదరగొట్టేసిన డ్యూడ్ బ్యూటీ.. ఆ స్టెప్స్ ఏంటి గురూ!

దక్షిణాది ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్న యంగ్ హీరోయిన్లలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బ్యూటీ కూడా చేరిపోయింది.;

Update: 2025-10-16 09:12 GMT

దక్షిణాది ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్న యంగ్ హీరోయిన్లలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బ్యూటీ కూడా చేరిపోయింది. ఆమె నటించిన ప్రేమలు మూవీ ఓవర్ నైట్ లో స్టార్ ను చేసింది. ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది..ఆమెనే మలయాళ బ్యూటీ మమిత బైజు.. ఒకప్పుడు మలయాళంలో సినిమాలు చేస్తూ మలయాళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రేమలు మూవీ తర్వాత దక్షిణాది ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ప్రేమలు సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా డ్యూడ్ మూవీతో మరోసారి మనల్ని అలరించడానికి రాబోతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈమె చేసిన డ్యాన్స్ ఎంతో మందిని ఆకట్టుకుంది. డ్యూడ్ మూవీ తమిళం, తెలుగు భాషల్లో అక్టోబర్ 17న అంటే మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో నటించిన ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు కి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉండడం సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా డ్యూడ్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మమిత బైజు తన ఎనర్జిటిక్ డాన్స్ పర్ఫామెన్స్ తో స్టేజ్ పై ఇరగదీసింది.. డ్యూడ్ మూవీ సాంగ్ కి మమిత బైజు వేసిన స్టెప్పులు ఎంతో మందిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఆమె ఎనర్జీ డాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది..

అయితే ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు కేవలం సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో నటించామా లేదా అన్నట్లు చూస్తారు. కానీ మమిత బైజు మాత్రం కేవలం గ్లామర్ మాత్రమే కాదు తన యాక్టింగ్, నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమిత బైజు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ హీరోయిన్ అంటే మీలా ఉండాలి..వాటే పర్ఫామెన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..

డ్యూడ్ మూవీ విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. మమిత బైజు హీరోయిన్ గా వస్తున్న ఈ మూవీ పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీకి కీర్తిశ్వరన్ డైరెక్షన్ వహించారు.. మమిత బైజు డ్యూడ్ మూవీ తర్వాత విజయ్ దళపతి నటిస్తున్న ఆయన చివరి మూవీ జననాయగన్ షూటింగ్లో జాయిన్ అవ్వబోతుంది. అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య నటిస్తున్న సూర్య 46వ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.అలా ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.

Tags:    

Similar News