• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మలయాళ హీరోకి మంచి బేరాలే...

మలయాళ హీరోకి మంచి బేరాలే తగులుతున్నాయ్..!

| ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-03-09 05:02 GMT

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా హీరోగా కెరీర్ లో సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. 2012 లో సెకండ్ షో సినిమాతో తెరంగేట్రం చేసిన దుల్కర్ అనతి కాలంలోనే తనకంటూ ఒక సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ తనయుడిగా కాకుండా తనకంటూ ఒక సరికొత్త ఇమేజ్ తెచ్చుకోవడం లో సక్సెస్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు.


మలయాళంలోనే కాదు తెలుగులో కూడా దుల్కర్ సల్మాన్ తన సత్తా చాటుతున్నాడు. 2018 లో మహానటి సినిమాతో ఇక్కడ ప్రేక్షకులను అలరించిన దుల్కర్ ఆ సినిమాలో జెమినీ గణేష్ పాత్రలో అదరగొట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మరోసారి అదే బ్యానర్ లో సీతారామం సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. తెలుగులో దుల్కర్ కి విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తోనే అతనికి ఇక్కడ వరుస అవకాశాలు ఇస్తున్నారు.

ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లక్కీ లక్ష్మణ్ సినిమా చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాలో ఒకప్పటి బ్యాంక్ ఆఫీసర్ లుక్ తో కనిపిస్తున్నాడు దుల్కర్. ఇక ఆ సినిమాతో పాటుగా నందమూరి బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబో సినిమాలో కూడా దుల్కర్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. తెలుగు ఆఫర్ అంటే చాలు దుల్కర్ ఫుల్ ప్రియారిటీ ఇస్తున్నాడు. బాలయ్య సినిమాలో అసలైతే ఆ పాత్రకు వేరే యువ హీరోని అనుకోగా అతను కాదనడంతో దుల్కర్ సల్మాన్ ఆ ఛాన్స్ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో రాబోతున్న థగ్ లైఫ్ సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ ఛాన్స్ అందుకున్నాడు. సినిమాలో కీలకమైన పాత్రలో దుల్కర్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ దుల్కర్ సల్మాన్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడని తెలుస్తుంది. తెలుగులో ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనకుండా చేస్తున్న దుల్కర్ తమిళ్ లో మాత్రం అంత ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది.

దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న సినిమాలకు మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారట. సొంత భాష మలయాళంలోనే ఇంకా దుల్కర్ తక్కువ రెమ్యునరేషన్ తో చేస్తున్నాడని టాక్. టాలీవుడ్ లో తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో వచ్చిన ప్రతి ఛాన్స్ ఒప్పుకుంటూ దుల్కర్ అదరగొట్టేస్తున్నాడని చెప్పొచ్చు.

Tags:    
  • MalayalamMegastar 
  • Mammootty 
  • DulquerSalmaan 
  • Mahanati 
  • Sitramam 
  • LuckyLaxman 
  • VenkyAtluri 
  • NBK109 
  • Balakrishna 
  • Bobby 
  • Tollywood 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS