వీడియో: మైకం క‌మ్మేలా మ‌లైకాభ్యాసం

మలైకా అరోరా ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. తన పవర్ ప్యాక్డ్ యోగా సెషన్స్‌తో ప్రేరణను అందించడంలో ఎప్పుడూ విఫలం కాదు.

Update: 2024-04-27 03:32 GMT

మలైకా అరోరా ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. తన పవర్ ప్యాక్డ్ యోగా సెషన్స్‌తో ప్రేరణను అందించడంలో ఎప్పుడూ విఫలం కాదు. మలైకా తన తాజా వర్కౌట్ వీడియోతో ఫిట్‌నెస్ స్ఫూర్తిని నింపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌లైకా షేర్ చేసిన యోగాభ్యాస వీడియోలు ఇప్పుడు హాట్ టాపిక్.

తాజాగా యోగా మ్యాట్ తో మ‌లైకా వీడియోని షేర్ చేసి ``యోగా మ్యాట్ ఉన్న స్త్రీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి`` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. యోగాతో వ్యాయామం మిక్స్ చేసి ఎలా ఫిట్ గా ఉండాలో ఈ వీడియోలో ఆవిష్క‌రించింది మ‌లైకా. నిజానికి దీనిని కేవ‌లం యోగా అనుకుంటే పొర‌పాటే.. యోగాలో వ్యాయామాన్ని మిక్స్ చేసి ఎలా చేయాలో నేర్పిస్తోంది. మ‌లైకా తల వెనుక తన చేతిని ఉంచడం.. పదేపదే లెగ్ క‌ద‌లిక‌లు.. చేతి కండ‌రాల క‌ద‌లిక‌ల‌ను క‌న‌బ‌రిచింది. అలాగే పొట్టను లక్ష్యంగా చేసుకుని నడుము ట్విస్ట్ వ్యాయామం చేయ‌డం, కాలు సాగదీయడం .. సైడ్ బెండ్‌లు చేయడం ఇవ‌న్నీ ఎంతో క‌ఠినంగా క‌నిపిస్తున్నాయి. మలైకా ఫిజికల్ ట్రైనింగ్ సెషన్ అక్కడితో ముగియలేదు. పుష్-అప్‌లు, ఊపిరితిత్తుల క‌స‌ర‌త్తులు, డంబెల్స్ - సైడ్ ప్లాంక్‌లతో హ్యాండ్ రొటేషన్‌లు కూడా చేసింది.

ఈస్టర్ రోజున కూడా.. మలైకా అరోరా వ్యాయామం విడిచిపెట్ట‌లేదు. పదే పదే మ‌లైకా యోగాసనానికి ప్రాముఖ్యతనిచ్చింది. మలైకా చక్రాసనం, నౌకాసనం, చమత్కరాసనాలు సహా అనేక రకాల యోగా భంగిమలను ప్రదర్శించింది. యోగా శరీరాన్ని టోన్ చేయ‌డ‌మే గాక షేప‌ప్ చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదే సమయంలో మానసిక ప్రశాంతత, సమతుల్యతను అందిస్తుంది. మలైకా చేసిన వ్యాయామాలు వెన్నెముక, దిగువ వీపు, దిగువ పొత్తికడుపు, కాళ్ళు , కోర్ కండరాల బ‌లాన్ని పెంచుతుంది.

తనలోని అంతర్గత ఫిట్‌నెస్ ఔత్సాహికురాలిని మళ్లీ తెరపైకి తెస్తూ మలైకా అరోరా ఒక గొప్ప ఆలోచనను ముందుకు తెచ్చింది. ``యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం`` అన్న‌ది త‌న క్యాప్ష‌న్. మ‌లైకా తన చేతులను గాలిలో ఉంచి, కాళ్ళతో విన్యాస ప్రవాహ యోగాను ప్రయత్నించిన వీడియో లో స్క్వాట్‌లు, హ్యాండ్‌స్టాండ్ ప్లాంక్ పుషప్, మౌంటైన్ క్లైంబర్స్ వ్యాయామం, సెమీ-స్క్వాట్‌లు, కొన్ని స్ట్రెచింగ్ వర్కౌట్‌లు ఉన్నాయి. సాధారణంగా వ్యాయామం చేయడం తక్షణ మూడ్ బూస్టర్. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.. శక్తిని పెంచుతుంది.. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది... బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News