డైరెక్టర్‌గా విశాల్.. మకుటంలో ఈసారి మోటివేషనల్ సాంగ్
కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్.
కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్. ఇప్పుడు హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మెగాఫోన్ పట్టి చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ మకుటం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ సినిమా ఇది. స్వర్గీయ ఆర్ బీ చౌదరి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఉన్నాయి.
సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ చాలా పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా టీజర్ తో పాటు ది రైజ్ అఫ్ లింగా అనే ఫస్ట్ సింగిల్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన నచ్చాకే వచ్చేరా.. అనే ఫోక్ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అప్డేట్స్ అన్నీ మకుటం సినిమా మీద ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.
ఈ ఊపును అలాగే కంటిన్యూ చేస్తూ లేటెస్ట్ గా మూవీ నుంచి 'కలతేలా..' అనే మరో పాటను రిలీజ్ చేశారు. గత పాటలకు పూర్తి భిన్నంగా ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ మోటివేషనల్ సాంగ్ లా సాగింది. ఇందులో హీరో విశాల్ తో పాటు దుషార విజయన్, పిల్లలు కూడా కనిపిస్తున్నారు. విజువల్స్ తో పాటు పాటలోని ఫీల్ చూస్తుంటే కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతుంది.
ఇక ఈ పాటకు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రాణం పోసింది అని చెప్పాలి. క్యాచీగా సాగే బాణీలతో ఆయన తన మార్క్ చూపించారు. రాజశ్రీ సుధాకర్ రాసిన ఈ పాటలోని పదాలు చాలా స్పూర్తిగా ఉన్నాయి. దీనికి తోడు కృష్ణ తేజస్వీ పాడిన విధానం వినడానికి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లతో పాటు జాన్ విజయ్, జయ ప్రకాష్, అబూ సలీం లాంటి స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు. సాంకేతిక నిపుణుల పరంగా కూడా టాప్ టీమ్ పని చేస్తోంది. రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.
హీరోగానే కాకుండా దర్శకుడిగా విశాల్ తనను తాను నిరూపించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ చూస్తుంటే ఆయన తన టార్గెట్ ను రీచ్ అయ్యేలాగే కనిపిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.