'వారణాసి' హైదరాబాద్ టూ అంటార్కిటికా జర్నీ!
ఒక్కసారి ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే.. ఈ సినిమా చిత్రీకరణ ప్రయాణం భాగ్యనగరం హైదరాబాద్‌లోనే ఘనంగా ప్రారంభమైంది.
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న సంచలన చిత్రం 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాతక్మంగా రూపొందుతున్న చిత్రమిది. కథా నేపథ్యం, విజువల్స్ పరంగా చిత్రం సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన సంస్కృతులు, భౌగోళిక వాతావరణాల కలబోతగా రూపొందుతున్న చిత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక్కసారి ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే.. ఈ సినిమా చిత్రీకరణ ప్రయాణం భాగ్యనగరం హైదరాబాద్‌లోనే ఘనంగా ప్రారంభమైంది.
అధునాతన సెట్లు, కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాల చిత్రీకరణను ఇక్కడే పూర్తి చేశారు. నిర్మాణ పరంగా అన్ని సౌకర్యాలు కలిగిన హైదరాబాద్ నుంచి మొదలైన సుదీర్ఘ ప్రయాణం, కథాగమనానికి అనుగుణంగా దేశవిదేశాల్లోని అనేక విభిన్న ప్రాంతాలకు విస్తరించడం విశేషం. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం చిత్ర బృందం ఒడిశాలోని ప్రకృతి రమణీయమైన చారిత్రక ప్రాంతాలకు చేరుకుంది. అక్కడ అందుబాటులో ఉన్న సహజసిద్ధమైన లొకేషన్లు, దట్టమైన అడవులు మరియు తీర ప్రాంతాల్లో కీలక ఘట్టాలను చిత్రీకరించారు. ఒడిశాలోని ప్రత్యేక వాతావరణం సినిమాకు కావాల్సిన రా అండ్ రియలిస్టిక్ లుక్‌ను అద్భుతంగా అందించింది.
అక్కడి నుంచి ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్‌కు రీచ్ అయింది. ఆఫ్రికా ఖండంలోకి ప్రవేశించింది. ఆఫ్రికాలోని విలక్షణమైన భూభాగాలు, ఎడారి ప్రాంతాలు , సహజ అడవుల నేపథ్యంలో శ్రమతో కూడుకున్న యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. హాలీవుడ్ చిత్రాలకు తగ్గకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆఫ్రికాలో తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయనడంలో సందేహం లేదు.
అన్నింటికంటే ప్రసిద్ధమైన అత్యంత సాహసవంతమైన ఘట్టం అంటార్కిటికా షెడ్యూల్. అత్యంత ప్రతికూల వాతావరణం, సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న అంటార్కిటికా మంచు ఖండంలో షూటింగ్ జరపడం అరుదైన మైలురాయి. రికార్డు స్థాయిలో అత్యంత కష్టతరమైన పరిస్థితులను తట్టుకుని అక్కడ సాధించిన చిత్రీకరణ, విజువల్ పరంగా భారతీయ ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనుంది.
హైదరాబాద్ టూ అంటార్కిటికా వరకు సాగిన ప్రయాణం లో కొంత భాగం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏడాది చివరికల్లా మిగతా చిత్రీకరణ పూర్తి చేస్తామని జక్కన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రదేశాల్లో.. ఇంకెన్ని దేశాల్లో షూటింగ్ జరుతుందన్నది ఆసక్తికరం. సినిమాకు సంబంధించి ఇంకా షూట్ చేయాల్సిన కీలకమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటి కోసం సిటీలోనే ప్రత్యేకంగా సెట్లు నిర్మిస్తున్నారు. అవపసరం మేర ఔట్ డోర్...ఆ సన్నివేశాలు డిమాండ్ చేసే విదేశీ లొకేషన్లను షూటింగ్ నిర్వహించనున్నారు.