మహేష్‌ బాబు రివ్యూ : ఆ సినిమా నవ్విస్తూ, ఏడిపించింది

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ తాజా చిత్రం 'సితారే జమీన్‌ పర్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;

Update: 2025-06-23 08:06 GMT

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ తాజా చిత్రం 'సితారే జమీన్‌ పర్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూవర్స్‌ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమాకు కమర్షియల్‌గా డీసెంట్ ఓపెనింగ్స్ దక్కినట్లు సమాచారం అందుతోంది. మెల్ల మెల్లగా ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కుతుందని, తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్‌ రన్‌లో సాలిడ్‌ కలెక్షన్స్‌ను రాబడుతుంది అనే విశ్వాసంను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఆమీర్‌ ఖాన్‌ చేసిన ఈ ప్రయత్నంను పలువురు స్టార్స్‌ అభినందిస్తున్నారు. సమాజంలో ఉన్న ఒక వర్గం పిల్లల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. వారికి దక్కాల్సిన ప్రేమ, చదువు వారికి దక్కడం లేదు. అలాంటి వారి నేపథ్యంలో ఈ సినిమాను ఆమీర్‌ ఖాన్‌ చేయడం జరిగింది.

ఈ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీలో ఆమీర్‌ ఖాన్‌కు జోడీగా జెనీలియా నటించిన విషయం తెల్సిందే. సినిమాకు ఆర్‌ ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఆమీర్‌ ఖాన్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించిన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా ఉందనే టాక్‌ వచ్చింది. దశాబ్ద కాలంగా ఆమీర్‌ ఖాన్‌ కమర్షియల్‌ హిట్‌ అందుకోలేక పోయాడు. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని ఆమీర్ ఖాన్‌ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమాకు వస్తున్న రిపోర్ట్స్‌ విషయంలో ఆమీర్‌ ఖాన్‌ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియాలో ఆ విషయాన్ని గురించి పోస్ట్‌ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పందించారు. ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు మహేష్‌ బాబు మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది. ఆయన ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం, ఇలాంటి మంచి కంటెంట్‌ను జనాలు చూడాలి అనే ఉద్దేశంతో సినిమాకు రివ్యూ ఇచ్చారు. సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ తెలుగు మీడియాలో బాగా పబ్లిసిటీ అయ్యి, సినిమాకు భారీగా పబ్లిసిటీ తెచ్చి పెట్టడం ఖాయం. దాంతో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌ బాబు చాలా అరుదుగా మాత్రమే తాను చూసిన సినిమాల గురించి సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఉంటాడు.

ఈ సినిమా గురించి ఆయన స్పందిస్తూ... సితారే జమీన్‌ పర్‌ సినిమా అద్భుతంగా ఉంది. ఆమీర్‌ ఖాన్‌ గారి గత క్లాసిక్‌ సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా చక్కగా ఉంది. ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా మిమ్ములను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మిమ్ములను ఈ సినిమా నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది. అంతే కాకుండా మీకు తెలియకుండానే చప్పట్లు కొట్టిస్తుంది. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా సినిమా ఉంటుందని అన్నట్లుగా మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేష్ బాబు ట్వీట్‌ కచ్చితంగా సినిమాకు అదనపు రెవిన్యూ తీసుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాను సమర్ధించడం, రివ్యూ ఇవ్వడంపై అంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News