సుకుమార్ తో మహేష్.. ఆరేడేళ్ల తర్వాత మ్యాటర్..?

సూపర్ స్టార్ మహేష్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు కలిసి 1 నేనొక్కడినే సినిమా చేశాడు.;

Update: 2025-06-20 02:30 GMT

సూపర్ స్టార్ మహేష్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు కలిసి 1 నేనొక్కడినే సినిమా చేశాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం అదొక క్రేజీ మూవీగా నిలిచింది. కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా సుకుమార్ మహేష్ కాంబో సినిమా ఫ్యాన్స్ కి థ్రిల్ కలిగించింది. ఐతే ఆ తర్వాత మళ్లీ సుకుమార్ తో మహేష్ సినిమా చేయాలని ట్రై చేసినా అది కుదరలేదు. పుష్ప ముందు సుకుమార్ మహేష్ తోనే సినిమా చేయాలని అనుకున్నాడు కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు.

పుష్ప రెండు భాగాల తర్వాత సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలు పెడతారని టాక్. ఐతే 1 నేనొక్కడినే తర్వాత మహేష్ సుకుమార్ కాంబోపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఒకసారి మిస్సైన ఈ కాంబో మళ్లీ ప్రయత్నిస్తే తప్పకుండా సెట్ అవుతుందని అంటున్నారు.

మహేష్ ఎలాగు రాజమౌళి సినిమాకు టైం ఇచ్చేశాడు. ఆ సినిమా పూర్తయ్యే దాకా మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. 2027 లో SSMB 29 రిలీజైతే ఆ తర్వాత మహేష్ నెక్స్ట్ సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐతే సుకుమార్ కూడా చరణ్ తో ఒక సినిమా ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఒక సినిమా ఆ నెక్స్ట్ పుష్ప 3 ఇలా ప్లానింగ్ లో ఉన్నాడు. ఒకవేళ మహేష్ తో సినిమా చేయడానికి అంతా సిద్ధం అనుకున్నా కూడా ఎలా లేదన్నా ఆరేడేళ్లు టైం పట్టేలా ఉంది.

మహేష్ కూడా రాజమౌళితో సినిమా తర్వాత మళ్లీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చేయాలని చూస్తాడు. సో ఆ రేంజ్ డైరెక్టర్స్ తోనే పనిచేసే అవకాశం ఉంది. ఐతే మహేష్ లిస్ట్ లో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ కూడా ఉన్నాడని తెలుస్తుంది. మొత్తానికి సుకుమార్, మహేష్ కాంబోపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నా ఈ ఇద్దరు కలిసి పనిచేయాలంటే మాత్రం 6, 7 ఏళ్లు టైం పట్టేలా ఉంది. సో ఈ క్రేజీ కాంబో కుదరాలంటే అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. ఈలోగా రాజమౌళి మహేష్ సినిమా చేసే సంచలనాలతో ఫ్యాస్ ఖుషి అవ్వాల్సిందే.

Tags:    

Similar News