మ‌హేష్ మౌనం వెనుక వ్యూహం!

మహేష్ మాత్రం తన వ్యక్తిగత పర్యటనల విషయంలో సైలెంట్‌గా ఉండటం చర్చనీయాంశమైంది. ఈ నిశ్శబ్దం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అనే సందేహం అభిమానుల్లో క‌లుగుతోంది.

Update: 2026-07-16 12:30 GMT

సూపర్ స్టార్ మహేష్ తన ప్రాజెక్టుల విషయంలో చాలా గోప్యత పాటిస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి తారలు 'వారణాసి'  సినిమా గురించి.. ఇదే సంద‌ర్భంలో రియ‌ల్ వార‌ణాసి పవిత్ర ప్రదేశాల గురించి అక్కడి ఆధ్యాత్మిక అనుభూతుల గురించి బహిరంగంగా చర్చిస్తుంటే? మహేష్ మాత్రం తన వ్యక్తిగత పర్యటనల విషయంలో సైలెంట్‌గా ఉండటం చర్చనీయాంశమైంది. ఈ నిశ్శబ్దం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా? అనే సందేహం అభిమానుల్లో క‌లుగుతోంది.

సాధారణంగా మహేష్ తన సినిమాల షూటింగ్స్, విశేషాల గురించి సోషల్ మీడియాలో పరిమితంగానే స్పందిస్తారు. అయితే ఇతర నటులు తమ పర్యటనలను, వ్యక్తిగత అనుభూతులను ప్రచారం చేసుకుంటున్న తరుణంలో మహేష్ మౌనంగా ఉండటం వెనుక ఓ పద్ధతి కనిపిస్తోంది. ఇది కేవలం గోప్యతను కాపాడుకోవడమే కాకుండా తనపై ఉండే అంచనాలను నిలబెట్టుకోవడానికి ఆయన అనుసరిస్తున్న స్ట్రాటజిక్ సైలెన్స్ గా విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఎలా శ్ర‌మిస్తున్నారో తెలిసిందే . ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో ఉండ‌టంతో ? ప్రతి చిన్న అడుగును అత్యంత గోప్యంగా ఉంచుతున్న‌ట్లు కనిపిస్తోంది. 'వారణాసి' లాంటి ప్రదేశాలను సందర్శించినా లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసినా? వాటిని పబ్లిసిటీ కోసం వాడుకోకుండా తన వ్యక్తిగత స్పేస్‌ను మాత్రమే ఇష్టపడటం మ‌హేష్ పద్ధతి.

సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ కెమెరాల కళ్ళలోనే ఉంటుంది. ఇలాంటి సమయంలో తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన విషయాల మధ్య మహేష్ స్పష్టమైన గీతను గీసుకుంటారు. ఇతర నటులు తమ అనుభవాలను పంచుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక కావచ్చు. కానీ మహేష్ మౌనం ద్వారానే ఫ్యాన్స్‌లో ఉత్కంఠను పెంచుతున్నారు. అప్‌డేట్ వస్తే అది ఏ రేంజ్‌లో ఉండాలో ఆయనకు బాగా తెలుసు.

అభిమానులు నిరంతరం ఏదో ఒక అప్‌డేట్ ఆశిస్తుంటారు. అయితే అతిగా స్పందించడం కంటే? సరైన సమయంలో ఒకే ఒక్క ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరచడం మహేష్ శైలి. ఈ మౌనం వల్ల సోషల్ మీడియాలో ఆయన పేరు ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. అదే ఆయనకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్. అనవసరమైన హడావుడి లేకుండా? కేవలం తన పని మీద దృష్టి పెట్టడమే మ‌హేష్ కెరీర్ సక్సెస్‌కు రహస్యం.

చివ‌రిగా మహేష్ బాబు మౌనం వెనుక ఉన్నది ఏదైనా? వ్యూహం కావచ్చు .అది ఆయన్ని ఒక మిస్టరీ స్టార్‌గా నిల బెట్టింది. తన ప్రతి సినిమా ప్రమోషన్ కోసం వేచి చూసే అభిమానులకు, ఆయన ఇచ్చే అప్‌డేట్ పండగలా మారుతుంది. ఏది ఏమైనా? నిశ్శబ్దమే మ‌హేష్ కు అతి పెద్ద బలం .. వ్యూహం అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News