SSMB 29 కోసం మహేష్ బాబు భారీ రిస్క్.. ఆశ్చర్యంలో జక్కన్న!

అయితే ఇప్పుడు మాత్రం చాలా నేచురల్ గా ఉండాలి అని మహేష్ బాబు తాను చేస్తున్న ఎస్ఎస్ఎంబి29 కోసం భారీ రిస్క్ చేస్తున్నట్లు సమాచారం.;

Update: 2025-09-30 19:30 GMT

సాధారణంగా హీరోలు సినిమాలలో యాక్షన్ సీన్స్ చేయాల్సివస్తే వారి స్థానంలో డూప్ ను ఉపయోగిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే హీరోలందరూ ఇలా డూప్స్ ని ఉపయోగించరు. కొంతమంది ఎంత కష్టమైనా సరే చేయడానికి వెనుకాడరు. అలా ఇప్పటికే సెట్ లో డూప్ లేకుండా కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ లో కూడా నటించి అందరిని ఆశ్చర్యపరిచిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ విషయానికి వస్తే.. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల కోసం డూప్ ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు మాత్రం చాలా నేచురల్ గా ఉండాలి అని మహేష్ బాబు తాను చేస్తున్న ఎస్ఎస్ఎంబి29 కోసం భారీ రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మహేష్ బాబు డెడికేషన్ కి జక్కన్న కూడా ఆశ్చర్యపోతున్నారట. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ సుమారుగా రూ.1200 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న చిత్రం SSMB 29. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఆఫ్రికన్ అడవులలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తూ ఉండగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైప్ దక్కించుకోవడంతో ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ కూడా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.. ఇలాంటి సమయంలో మహేష్ బాబు డెడికేషన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి డూప్ వాడకుండా ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ లో కూడా స్వయంగా మహేష్ బాబు పాల్గొంటూ షూటింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం.

మహేష్ బాబు డెడికేషన్ చూసి రాజమౌళి కూడా సర్ప్రైజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మహేష్ బాబు ఈ సినిమా కోసం భారీగానే కష్టపడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమా అప్డేట్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా నుంచి అప్డేట్ ఉంటుందని రాజమౌళి.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 9న రివీల్ చేసిన విషయం తెలిసిందే. మరొకవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెడలో లాకెట్ ను హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు జక్కన్న. మరి ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుంది? సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుంది? అనే విషయం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News