SSMB 29 రిలీజ్ డేట్.. కన్ఫ్యూజన్ తీరేది అప్పుడే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా SSMB29పై అభిమానుల్లో ఊహించని స్థాయిలో ఆసక్తి నెలకొంది.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా SSMB29పై అభిమానుల్లో ఊహించని స్థాయిలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ దశలోకి వెళ్లింది. కెన్యాలోని నైరోబీలో జరుగుతున్న షెడ్యూల్‌లో మహేశ్ కొంత భాగాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో అప్పటివరకు కొత్త లుక్ లేదా గ్లింప్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దని అభిమానులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టాక్ ఏంటంటే, అదే సమయంలో సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న సస్పెన్స్ కూడా వీడనున్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారని ఇండస్ట్రీలో బలంగా ఓ టాక్ అయితే వినిపిస్తోంది. SSMB29ను మేకర్స్ సంక్రాంతి 2027కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇది నిజమైతే, పండుగ సీజన్‌లో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అంతవరకు మాత్రం రిలీజ్ డేట్‌పై ఉన్న కన్ఫ్యూజన్ అలాగే కొనసాగనుంది.
ఈ సినిమాకు సంబంధించి మరో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే, హాలీవుడ్ కు సంబంధించిన కొందరు స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, రాజమౌళి స్టైల్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌ను అందించేందుకు సాంకేతికంగా భారీ బడ్జెట్ కేటాయించారు. దాదాపు రూ.1200 కోట్లతో ఈ సినిమా నిర్మితమవుతుండటం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్ రికార్డ్ కానుంది.
ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి, ఈ సారి తన సినిమాకు జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ లుక్ ఇవ్వబోతున్నారని సమాచారం. దాంతో మహేశ్ బాబు కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని రోలర్ కోస్టర్ అనుభవం SSMB29 అవుతుందని అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. మొత్తానికి, ఫస్ట్ గ్లింప్స్ వచ్చే వరకు రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాలు అలాగే ఉంటాయి. కానీ ఒకసారి అధికారిక అప్‌డేట్ రాగానే, SSMB29పై హైప్ మరో లెవెల్‌కు చేరడం ఖాయం.