బర్త్ డే స్పెషల్.. మహేష్- జక్కన్న మూవీ బిగ్ అప్డేట్ ఇదిగో..
అదే సమయంలో నోట్ కూడా రిలీజ్ చేశారు. తాము సినిమా షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశామని తెలిపారు.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB 29 సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. రాజమౌళి ఒక్క అప్డేట్ అంటే ఒక్క అప్డేట్ ఇవ్వలేదు. కనీసం లీక్స్ కూడా చేయడం లేదు.
దీంతో అప్డేట్స్ కోసం అభిమానులు, సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. అయితే నేడు మహేష్ బాబు బర్త్ డే అన్న విషయం తెలిసిందే. అందుకే నేడు మ్యాసివ్ అప్డేట్ వస్తుందని అంతా ఆశించారు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు రాజమౌళి స్పందించారు. మహేష్ బాబు ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.
అందులో మహేష్ మెడలో నందికేశ్వరుడి లాకెట్ కనిపించింది. రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో ప్రీ లుక్ అయితే అదిరిపోయిందని, వేరే లెవెల్ లో ఉందని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. కంప్లీట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పూర్తి లుక్ ను నవంబర్ లో రివీల్ చేస్తామని తెలిపారు జక్కన్న.
అదే సమయంలో నోట్ కూడా రిలీజ్ చేశారు. తాము సినిమా షూటింగ్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశామని తెలిపారు. దాని గురించి మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భారీ స్థాయిలో మూవీ రానుందని వెల్లడించారు. అయితే ఓ ప్రెస్ మీట్ పెట్టడం లేదా ఫోటోస్ తో స్టోరీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేమన్నారు.
సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నామని అంచనాలు పెంచారు. నెవ్వర్ బిఫోర్ అనేలా మూవీ తీస్తున్నామని అన్నారు. అందుకు గాను తమకు అంతా కోపరేట్ చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో తన పోస్ట్ కు రాజమౌళి.. #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేశారు. ఆ ట్యాగ్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
సినిమాలో మహేష్ బాబును ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా రాజమౌళి చూపించనున్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత తొలి అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నెట్టింట ఫుల్ గా ట్రెండ్ చేస్తున్నారు. దీంతో రాజమౌళి పోస్ట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. టాప్ ట్రెండింగ్ లో సందడి చేస్తోంది.