మహేష్‌, పీసీకి ఆ కష్టం... జక్కన్న వదలట్లేదట!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.;

Update: 2025-11-19 10:01 GMT

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లిమ్స్‌తో రాజమౌళి మొత్తం ఇండియన్‌ సినిమా పరిశ్రమ దృష్టిని, ఇండియన్ సినీ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. పురాణాలు, ఇతిహాసాలను చూపిస్తూనే ఈతరంను ఆ గ్లిమ్స్‌ లో చూపడం ద్వారా జక్కన్న అసలు చెప్పబోతున్నది ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి లుక్స్ చాలా విభిన్నంగా ఉన్నాయి. ప్రియాంక చోప్రా చీర కట్టుకుని గన్‌ పేల్చుతూ ఉంటే, మహేష్ బాబు మాస్‌ లుక్‌ లో ఎద్దుపై త్రిశూలం పట్టుకుని రావడంతో కథలోని చిన్న పాయింట్‌ ను కూడా ఊహించడం సాధ్యం కావడం లేదు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు.

మహేష్‌ బాబు - ప్రియాంక చోప్రా జోనస్‌ జంటగా...

సాధారణంగానే రాజమౌళి సినిమాలు అరౌండ్‌ ది గ్లోబ్‌ రిలీజ్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. ఇది హాలీవుడ్‌ సినిమాల రేంజ్‌లో ఉంది కనుక మరింతగా ఈ సినిమా ప్రేక్షకులను రీచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం జక్కన్న అండ్‌ టీం గత చిత్రాలతో పోల్చితే రెట్టింపు ఉత్సాహంతో కష్టపడుతున్నారని, గత రాజమౌళి హీరోలతో పోల్చితే మహేష్ బాబు మరింత కష్టపడుతున్నాడు అని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఎక్కువ లేకపోవడం ప్రేక్షకులకు నిరాశ మిగిల్చింది. అందుకే వారణాసి సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడట. అంతటి ప్రాధాన్యత ఉన్న హీరోయిన్‌ పాత్ర సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటేనే బాగుంటుంది. అందుకే రాజమౌళి ఆ దిశగా ప్రియాంక చోప్రాను రెడీ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి నిర్ణయం..

ప్రియాంక చోప్రా హిందీలో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటుంది. కానీ ఇతర భాషల్లో ఆమె డబ్‌ చెప్పడం దాదాపు అసాధ్యం అంటూ అంతా భావిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం విడిచేలా లేడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఆలియా భట్‌ తో డబ్బింగ్‌ చెప్పించాలని తెలుగు నేర్పించారు. అంతే కాకుండా ఆమెతో డబ్బింగ్‌ సైతం చెప్పించారు. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె డబ్బింగ్‌ చెప్పిన వర్షన్‌ ను తీసుకు రాలేదు. ఆ సమయంలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా ఉండేలా జక్కన్న జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రియాంక చోప్రాకు ఏడాది పాటు కంటిన్యూగా ఒక తెలుగు నేర్పించే ట్యూటర్‌ ను ఏర్పాటు చేశారట. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర సౌత్‌ భాషల్లోనూ ఆమెతో డబ్బింగ్‌ చెప్పించడం ద్వారా నేచురాలిటీకి దగ్గర ఉంచాలని భావిస్తున్నారట. అందుకే ఆ భాషలపైనా పట్టు కోసం పీసీ ప్రయత్నాలు చేస్తోంది.

2027లో వారణాసి విడుదల

హీరోయిన్‌ ప్రియాంక చోప్రా మాత్రమే కాకుండా హీరో మహేష్‌ బాబు సైతం సొంత డబ్బింగ్‌ కోసం కష్టపడబోతున్నాడని తెలుస్తోంది. మహేష్‌ బాబు తెలుగులో ఈజీగా డబ్బింగ్ చెప్పేస్తాడు. కానీ హిందీ, ఇతర సౌత్‌ భాషల్లో డబ్బింగ్‌ చెప్పడం అంత ఈజీ విషయం కాదు. అందుకే మహేష్‌ బాబు ఆయా భాషలపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడని తెలుస్తోంది. భాషకు సంబంధించి, ఇతర భాషల వర్షన్‌ల కోసం కంటిన్యూ వర్క్‌ షాప్ నడుస్తుందని, అందులో అన్ని భాషలకు సంబంధించిన వర్షన్‌లపై చర్చలు జరుపుతూ ఉన్నారని తెలుస్తోంది. మహేష్‌ బాబు తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎప్పుడూ డబ్బింగ్‌ చెప్పలేదు. కానీ ఈసారి రాజమౌళి వదిలేలా లేడు. దాంతో పీసీతో పాటు మహేష్‌ బాబు సైతం డబ్బింగ్‌ కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. 2027లో సినిమా రాబోతుంది. కనుక అప్పటి వరకు వీరిద్దరు ఆయా భాషలపై పట్టు సాధించి డబ్బింగ్‌ నేచురల్‌గా చెప్తారని యూనిట్‌ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News