మ‌హేష్ కు త‌దుప‌రి ఎంపిక పెద్ద టాస్కే!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ `వారణాసి` లో న‌టిస్తున్నారు.;

Update: 2026-05-01 22:30 GMT

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ `వారణాసి` లో న‌టిస్తున్నారు. ఈ సినిమాతో మ‌హేష్ పాన్ ఇండియాను దాటి గ్లోబ‌ల్ స్థాయి ఇమేజ్ ను సొఓంతం చేసుకుంటాడు. దీంతో మ‌హేష్ త‌దుప‌రి ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేసినా? అంత‌కు మించే ఉండాలి తప్ప త‌గ్గ‌డానికి వీలులేదు. ఈనేప‌థ్యంలో మహేష్ చేసే ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది? అనే చ‌ర్చ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు `యానిమల్` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా. సందీప్ మేకింగ్ స్టైల్ , హీరోలను ప్రెజెంట్ చేసే తీరు మహేష్‌కు ఎంతో లైక్ చేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఉండే తీవ్రత , వివాదాస్పద పాత్రల విషయంలో మహేష్ కొంత జాగ్రత్తగా ఉంటారు.

గతంలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ సందీప్ వంగా మహేష్ ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ అండ్ క్లాస్ కథను సిద్ధం చేస్తే తప్ప ఈ కాంబినేషన్ పట్టాలెక్కడం అంత సుల‌భం కాదు. అలాగే `ఉప్పెన`తో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బుచ్చి రామ్ చరణ్‌తో `పెద్ది` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలి సిందే. బుచ్చిబాబు వద్ద అద్భుతమైన పీరియాడిక్ కథ ఉందని అది మహేష్‌కు బాగా నచ్చిందని సమాచారం. బుచ్చిబాబు మేకింగ్‌లో ఉండే సహజత్వం మహేష్ కు ఓ కొత్త డైమెన్షన్‌ను ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

రాజమౌళి సినిమా తర్వాత ఒక రిఫ్రెషింగ్ కథతో రావాలనుకుంటే బుచ్చిబాబు సరైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ పేరు కూడా రేసులో వినిపిస్తుండటం విశేషం. `ఉరి ద సర్జికల్ స్ట్రైక్`, `ధురంధర్` చిత్రాలతో సత్తా చాటిన ఆదిత్య ధర్ మహేష్ తో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. వార‌ణాసి తర్వాత మహేష్‌కు పాన్ ఇండియా లెవల్‌లో విపరీతమైన క్రేజ్ వస్తుంది కాబట్టి బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయడం మార్కెట్ పరంగా కలిసొచ్చే అంశం. ఆదిత్య ధర్ టేకింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉండటం మహేష్‌ను ఆకర్షిస్తున్నట్లు సమాచారం.

అయితే మహేష్ కంఫర్ట్ జోన్ అంత సుల‌భంగా దాటి రారు. కథలోని బలాన్ని చూస్తారు. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడితో పని చేసిన తర్వాత ఆ ఇంపాక్ట్ తగ్గకుండా ఉండాలంటే ఎంపిక చేసుకోబోయే దర్శకుడు మేకింగ్ పరంగా రాజీ పడకూడదు. పైన పేర్కొన్న ముగ్గురిలో ఒకరు ఫైనల్ అవుతారా? లేక మ‌రో డైరెక్ట‌ర్ ఎవ‌రైనా రంగంలోకి దిగుతారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మహేష్ నిర్ణయం మాత్రం బాక్సాఫీస్ సమీకరణాలను పూర్తిగా మార్చ‌గ‌ల‌దు. అందులో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News