• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతడు రీ రిలీజ్.. యువతి...

అతడు రీ రిలీజ్.. యువతి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో హోరెత్తిన థియేటర్!

| ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన చిత్రం 'అతడు'.

By - Madhu Reddy
Update: 2025-08-09 07:12 GMT

ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన చిత్రం 'అతడు'. ఇందులో మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ టీవీలోకి వచ్చిన తర్వాత క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. ఇకపోతే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో 4K లో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు థియేటర్లలో తెగ హంగామా చేస్తున్నారని చెప్పవచ్చు.

అందులో భాగంగానే "పిల్లగాలి అల్లరి" పాటకు ఒక యువతి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టెంట తెగ వైరల్ అవుతోంది. సినిమాలో అచ్చం త్రిష ధరించిన కాస్ట్యూమ్స్ తో పాటు సేమ్ స్టెప్పులతో ఆ మహిళ అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అదరగొట్టేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మరోసారి త్రిషను గుర్తు చేసిందని, ఆమెపై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు మహేష్ బాబు అభిమానులు.

ఇకపోతే థియేటర్లలో అభిమానులు ఇలా సందడి చేయడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది మే 31వ తేదీన మహేష్ బాబు 'ఖలేజా' సినిమాను రీ రిలీజ్ చేశారు. తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ లో కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే విజయవాడలోని ఒక థియేటర్లో అభిమానులు చాలా అత్యుత్సాహం చూపించారు. ముఖ్యంగా మహేష్ బాబు సీన్ లను రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది డాన్సులు వేస్తే.. మరి కొంతమంది డైలాగ్స్ తో అదరగొట్టేశారు. ఇంకొంతమంది హాస్పిటల్ సీన్ చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడ మరో అభిమాని ఏకంగా మహేష్ బాబు ఎంట్రీ సీన్ రీ క్రియేట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఏకంగా థియేటర్లోకి పాములు తీసుకొని వచ్చి తెగ సంచలనం సృష్టించారు. ఇలా మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో ఆ సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ వైరల్ అవుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఆ లేడీ యువతి కూడా త్రిష గెటప్ లో వచ్చి.. రీ క్రియేట్ చేసి అందరి దృష్టిలో పడింది.

మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.. ఆఫ్రికన్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రాబోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఒక లోతైన లోయలో జరుపుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రముఖ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆమె పార్ట్ కి సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాజమౌళి తన ఎక్స్ ఖాతా ద్వారా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నవంబర్లో రిలీజ్ చేస్తామని అంచనాలు పెంచేశారు.

‘అతడు’ రీరిలీజ్.. థియేటర్‌లో యువతి సూపర్ డాన్స్(VIDEO) 🔥😎🤟#HBDSuperstarMahesh #Hyderabad #HBDSuperstarMaheshBabu #vizag #HBDMaheshBabu #Tollywood pic.twitter.com/Jm1ZHxoqb2

— Jagun Forever ®🔥💪 (@jagun_ys) August 9, 2025
Tags:    
  • MaheshBabu 
  • Athadu4K 
  • MaheshBabuBirthday 
  • PillagaliAllari 
  • TrishaDance 
  • AthaduReRelease 
  • SSMB29 
  • మహేష్‌బాబు 
  • అతడు4K 
  • మహేష్‌బాబు_పుట్టినరోజు 

Similar News

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS