వెయిటింగ్ కి తగ్గట్టు డబుల్ ఫీస్ట్ ఇస్తారా..?
స్టార్ సినిమాలు కనీసం రెండేళ్లైనా సెట్స్ మీద ఉంటాయి. తప్పదు అభిమానులు కోరినట్టుగా విజువల్ ఫీస్ట్ ఇవ్వాలంటే ఆ మాత్రం టైం తీసుకోవాల్సిందే.;
స్టార్ సినిమాలు కనీసం రెండేళ్లైనా సెట్స్ మీద ఉంటాయి. తప్పదు అభిమానులు కోరినట్టుగా విజువల్ ఫీస్ట్ ఇవ్వాలంటే ఆ మాత్రం టైం తీసుకోవాల్సిందే. ఐతే డైరెక్టర్, హీరో కాంబినేషన్ మీద ఉన్న అంచనాలను అందుకోవడం కోసం కచ్చితంగా తగిన టైం తీసుకోవాల్సిందే. ఐతే ఈ టైం లో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటాయి. 2025 లో చాలామంది స్టార్స్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ని అప్సెట్ చేశారు. 2025 లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వస్తుందని అనుకుంటే అది మిస్ అయ్యింది.
ప్రభాస్ రాజా సాబ్ నెక్స్ట్ జనవరికి..
ఈ ఇయర్ లో ప్రభాస్ రాజా సాబ్ కూడా రావాల్సింది కానీ అది కూడా ఆఖరి నిమిషం లో డిసెంబర్ నుంచి నెక్స్ట్ జనవరికి వెళ్లింది. ఇక మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా ఈ ఇయర్ సినిమాలు చేయలేదు. ఐతే మహేష్ అల్లు అర్జున్ చూస్తుంటే 2026 అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మహేష్ ఏమో రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. SSMB 29 సినిమాగా వస్తున్న ఈ మూవీ 2027 రిలీజ్ ఉంటుందని టాక్.
ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా 2027 లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అట్లీ ఈ సినిమాను చాలా ప్లానింగ్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై సూపర్ కాన్ ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. సో 2026 మిస్ అవుతున్న ఈ ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ కి అంతకుమించిన డబుల్ ట్రీట్ ఇస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ఒక సెపరేట్ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ కి సూపర్ స్టార్ మహేష్ తోడయ్యాడు సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్నది చిన్నదనిపించే రిజల్ట్ గురి పెట్టారు.
మహేష్, అల్లు అర్జున్..
అల్లు అర్జున్ అట్లీ సినిమా కూడా అంతే.. మోషన్ క్యాప్షన్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గదని టాక్. ఆల్రెడీ సినిమా అనౌన్స్ మెంట్ తోనే రేంజ్ ఏంటో చూపించాడు అట్లీ. సో ఈ రెండు సినిమా 2027 లోనే వస్తాయి. ఈ ఇద్దరు హీరోలు కూడా 2026 మిస్ చేసి 2027 లో బాక్సాఫీస్ బ్లాస్ట్ కి సిద్ధమవుతున్నారు. ఐతే ఈ రెండు సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ ప్లాన్ చేయకుండా ఉంటే బెటర్. సో 2027 మిగతా సినిమాలు ఎలా ఉన్నా ఈ రెండిటి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుందని చెప్పొచ్చు.