'మహావతార్: నరసింహ'.. రంగంలోకి టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్
ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహావతార్: నరసింహ సినిమాను ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.;
కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పలు సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన బ్యానర్.. వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఏడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
ఆ సినిమాలన్నీ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విష్ణుమూర్తి పది అవతారాలపై యానిమేషన్ ఫ్రాంచైజీలో ఏడు మూవీలు రూపొందుతుండగా.. మొదటి సినిమా మహావతార్: నరసింహ రిలీజ్ కు కూడా సిద్ధమవుతోంది. జులై 25వ తేదీన భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
గ్రాండ్ విజువల్స్ అండ్ వీఎఫ్ ఎక్స్ తో రూపొందుతున్న ఆ సినిమా.. త్రీడీలో ఐదు భాషల్లో ఒకేసారి విడుదల అవ్వనుంది. తెలుగులో కూడా సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహావతార్: నరసింహ సినిమాను ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
"మహావతార్ నరసింహ దైవిక ఉగ్రత తెలుగు రాష్ట్రాల్లో గర్జించడానికి సిద్ధంగా ఉంది. జులై 25న ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అంతటా గీతా ఆర్ట్స్ తాలూకా గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతోంది" అని మేకర్స్ చెప్పారు. అలా టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని చెప్పాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీకి శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. వరుసగా గ్లింప్స్ రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం మేకర్స్ తీసుకొచ్చిన ట్రైలర్, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు గ్లింప్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఊహించని ఎలిమెంట్స్, వీఎఫ్ ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో మెప్పించాయి. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందనే బజ్ నెలకొల్పాయి. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.