బాక్సాఫీస్ వద్ద మహావతార్ గర్జన.. బడా సినిమాలకు ఛాలెంజ్
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన తొలి పౌరాణిక యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ.;
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన తొలి పౌరాణిక యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ. హొంబలే ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలు రూపొందిస్తుంది. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇటీవల మహావతార్ నరసింహ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇది పూర్తిగా యానిమేటెట్ సినిమా.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందు ప్రమోషన్స్, స్పెషల్ ఈవెంట్స్ లాంటివి లేకుండా డైరెక్ట్ గా థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఇక దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ప్రత్యేక స్పందన రావడంతో సినిమాకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.
అటు హిందీ వెర్షన్ లో అయితే ఈ సినిమా దూసుకుపోతోంది. దీనికి నార్త్ లో మాసివ్ రెస్పాన్స్ వస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో స్క్రీన్లను ఈ సినిమాకు కేటాయిస్తున్నారు. ఇటు తెలుగులోనూ అదే స్పందన. ఊహించని రేంజ్ లో ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. నాన్ హాలీడే రోజు కూడా డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఫలితంగా ఈ సినిమా దేశవ్యాప్తంగా తొలి వారంలోనే రూ.53 కోట్లు వసూల్ చేసి పెద్ద సినిమాలకు ఛాలెంజ్ విసురుతుంది.
తొలి వారంలోనే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో లాంగ్ రన్ లో కలెక్షన్లు పెరుగే ఛాన్స్ ఉంది. ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.100 కోట్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ల లో ఏడు సినిమాలు రానున్నట్లు మేకర్స్ హోంబలే ఫిల్మ్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా రిలీజైన మహావతార్ నరసింహ తొలి పార్ట్ ఇంతటి ఘన విజయం సాధించడం, ఈ యూనివర్స్ క గట్టి పునాది పడినట్లే
దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి హోంబలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహను సంయుక్తంగా నిర్మించింది. సినిమానే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంగీతం సామ్ సిఎస్, అబే టెర్రెన్స్, సచిన్ లాల్ అందించారు.