'లే గయీ' స్టెప్‌తో అలరించిన మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్!

బాలీవుడ్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా `దిల్ తో పాగల్ హై` విడుదలై దశాబ్దాలు గడిచినా? అందులో పాటలు, నృత్యాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉన్నాయి.

Update: 2026-06-13 08:04 GMT

బాలీవుడ్ క్లాసిక్ రొమాంటిక్ డ్రామా `దిల్ తో పాగల్ హై` విడుదలై దశాబ్దాలు గడిచినా? అందులో పాటలు, నృత్యాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ `లే గయీ` హుక్ స్టెప్‌ను బాలీవుడ్ నృత్య రాణులు మాధురీ దీక్షిత్- కరిష్మా కపూర్ కలిసి మరోసారి రీక్రియేట్ చేశారు. ఇద్ద‌రు కలిసి చేసిన చేసిన‌ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు వెండితెరపై తమ అద్భుతమైన నృత్యాలతో పోటీపడిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు కనువిందుగా మారింది.

ఒక ప్రత్యేక వేదికపై సుంద‌రాంగులు పంచుకున్న క్షణాలు.. పాత జ్ఞాపకాలను ఒక్కసారిగా తట్టిలేపాయి. వయసు పెరిగినా తమలోని గ్రేస్ ఏమాత్రం డ్రాప్ అవ్వలేదని నిరూపించారు. ఇద్ద‌రు పాత హుక్ స్టెప్‌ను ఎలాంటి మార్పులు లేకుండా య‌ధాత‌ధంగా దించేసారు. యష్ చోప్రా దర్శకత్వంలో 1997లో రిలీజ్ అయిన `దిల్ తో పాగల్ హై` చిత్రంలో పూజా (మాధురి), నిషా (కరిష్మా) పాత్రల మధ్య వచ్చే డ్యాన్స్ జుగల్‌బందీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా కరిష్మా కపూర్ ఒంటరిగా డాన్స్ చేసే `లే గయీ` పాట ఆ కాలంలో ఓ సంచలనం సృష్టించింది.

అదే పాటకు మాధురీ దీక్షిత్ కూడా తోడై తోటి నటితో కలిసి అడుగులు వేయడం సినిమా ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఇద్ద‌రిని భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యుత్తమ డ్యాన్స్ ద్వయం అని కొనియాడుతున్నారు. అయితే ఈ ఐకానిక్ ఫ్రేమ్‌లో రాహుల్ పాత్రధారి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ఉండి ఉంటే రీక్రియేషన్ మరింత పరిపూర్ణంగా ఉండేదని మరికొందరు అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని సామాజిక మాధ్యమాల్లో ఇలా స్పందించారు. `కాలం మారినా? తారల వయసు పెరిగినా? వారిలోని సృజనాత్మకత ,నృత్య నైపుణ్యం ఎప్పటికీ చెరిగిపోవు అనడానికి ఈ ప్రదర్శనే నిదర్శనం` అని రాసుకొచ్చారు. ఈ వీడియో నిమిషాల్లోనే మిలియన్ల వీక్షణలను .. వేల సంఖ్యలో షేర్లను సొంతం చేసుకుని ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఇలాంటి రీక్రియేషన్లు వినోదాన్ని మాత్రమే కాదు.. అద్భుతమైన సినిమా సువర్ణ యుగాన్ని కళ్లముందుకు తెస్తాయి. మాధురి, కరిష్మాల `లే గయీ` హుక్ స్టెప్ బాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్ వైబ్‌ను మళ్లీ సజీవం చేసింది. ఈ క్రేజీ డ్యాన్స్ మూమెంట్ ద్వారా దిల్ తో పాగల్ హై జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోవని మరోసారి రుజువైంది.

Tags:    

Similar News