చీరకట్టులో హృదయాన్ని తాకుతున్న మానస చౌదరి!
అందులో భాగంగానే తాజాగా మానస చౌదరి కూడా ఇలా పర్పుల్ కలర్ చీర ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది.;
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు గ్లామర్ తోనే కాదు సాంప్రదాయంగా ఆకట్టుకుంటూ అభిమానులలో గౌరవాన్ని పెంచుకుంటున్నారు. మరి కొంతమంది ఆ చీరకట్టులో కూడా గ్లామర్ వలకబోస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో కనిపించి, యువత హృదయాన్ని తాకుతూ అందరి దృష్టిని ఆకర్షించింది యంగ్ బ్యూటీ మానస చౌదరి. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చిన ఈమె.. తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. సాంప్రదాయంగా కనిపిస్తూ తనపై గౌరవాన్ని మరింత పెంచుకుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ అభిమానులకు చేరువవుతున్న నటీమణులలో మానస చౌదరి కూడా ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పర్పుల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటు సెలబ్రిటీలు కూడా పర్పుల్ కలర్ డ్రెస్సులు, చీరలు ధరించి ట్రెండు ని బాగా యూజ్ చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే తాజాగా మానస చౌదరి కూడా ఇలా పర్పుల్ కలర్ చీర ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. సింగిల్ ప్లేర్ తో పైను సరిచేసిన ఈమె.. తన జుట్టును గాలికి వదిలేసి తన స్టైలిష్ లుక్కును కంప్లీట్ చేసింది. ఈ చీర కట్టులో ఎంతో అందంగా ముద్దుగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మానస చౌదరికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మానస చౌదరి కెరియర్ విషయానికి వస్తే.. సుమా కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన బబుల్గం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది తెలుగు అమ్మాయి మానస చౌదరి. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె తన బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా చెప్పుకొచ్చింది. మానస చౌదరి మాట్లాడుతూ.." నేను చిత్తూరు జిల్లా పుత్తూరులో జన్మించాను. కానీ చెన్నైలో పెరిగాను. మా నాన్న వ్యాపారం చేస్తారు. నాకు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. నిజానికి నేను ఇండస్ట్రీలోకి రావాలనుకోలేదు. కానీ కాలక్రమేనా సినిమాపై ఇష్టం పెరిగి, ఇండస్ట్రీలోకి వచ్చాను .
ఇదే విషయాన్ని మొదటి మా అమ్మ నాన్నతో చెబితే వారు కూడా నాకు తమ ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రుల సహాయంతో చదువు పూర్తి చేసి, మోడలింగ్ ప్రారంభించాను. అదే సమయంలో ఒక ఫ్రెండ్ ద్వారా దర్శకుడు రవికాంతకు నా ప్రొఫైల్ పంపించి..ఆయన టీం నుంచి కాల్ రావడంతో ఫోటోషూట్ చేసాము. అలా నా సినిమా జర్నీ మొదలైంది అంటూ మానస చౌదరి తన సినీ కెరియర్ గురించి చెప్పుకొచ్చింది.
ఇకపోతే బబుల్గం సినిమాలో మానస చౌదరి చేసింది తొలిసారి అయినా ఈమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. అద్భుతమైన నటన కనబరిచింది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికైతే మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది మానస చౌదరి