డ‌బుల్ బ్యారెల్ గ‌న్ చేత‌ప‌ట్టిన `బంగారం`

2022లో మయోసిటిస్ నిర్ధారణ తర్వాత ఏడు నెలల విరామం తీసుకున్న స‌మంత తిరిగి పనిలోకి వస్తానని చెప్పిన కొన్ని నెలలకు ఈ అప్‌డేట్ అందింది.

Update: 2024-04-28 11:14 GMT

మెడ‌లో న‌ల్ల‌పూస‌లు.. పుస్తెలు.. చీర‌క‌ట్టుకుని దీనికి పూర్తి కాంట్రాస్ట్ గా తుపాకీ ప‌ట్టుకుని ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లా ర‌గిలిపోతున్న ఈ గృహిణిని చూశారా? చూస్తే వామ్మోవ్ అంటారు! .. ఇంత‌లోనే సమంత రూత్ ప్రభు స‌డెన్ ట్విస్టిచ్చింది. ఆదివారం తన 37వ పుట్టినరోజు సందర్భంగా `బంగారం` అనే కొత్త చిత్రాన్ని ప్రకటించడ‌మే గాకుండా సమంత సొంత‌ బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్‌పై తొలి సినిమాగా దీనిని నిర్మించనున్న‌ట్టు తెలిపింది.


2022లో మయోసిటిస్ నిర్ధారణ తర్వాత ఏడు నెలల విరామం తీసుకున్న స‌మంత తిరిగి పనిలోకి వస్తానని చెప్పిన కొన్ని నెలలకు ఈ అప్‌డేట్ అందింది. త్వరలో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ -బంగారం అనౌన్స్‌మెంట్ టీజర్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. సమంత ఈ చిత్రాన్ని స్వ‌యంగా నిర్మించడమే కాకుండా కథానాయికగా కూడా కనిపించనుంది. క‌థాంశం, తారాగణం, సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన ఇతర సమాచారం తెలియాల్సి ఉంది. స‌మంత ఐడియాల‌జీ, తాజా టైటిల్ టీజ‌ర్ ని బ‌ట్టి ఇది బ‌ల‌మైన సామాజిక అంశం చుట్టూ తిరిగే క‌థాంశ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. ఒక గృహిణి తిరుగుబాటు డ్రామా అని కూడా భావించాల్సి ఉంటుంది. మ‌న ఇంటి బంగారం న‌చ్చ‌ని వాడిపై తిరగ‌బ‌డితే ఏమ‌వుతుందో తెర‌పైనే చూడాల‌ని అంతా భావిస్తున్నారు.

Read more!

సమంత డిసెంబర్ 2023లో ట్రాలా మూవింగ్ పిక్చర్స్‌ని ప్రారంభించింది. బ్యానర్‌ను ప్రకటించినప్పుడు ఇది మోడ్ర‌న్ ఏజ్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తుందని ప్ర‌క‌టించారు. కొత్త-యుగం భావ వ్యక్తీకరణలు ఆలోచనలకు సంబంధించిన కంటెంట్‌ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సామ్ చెప్పారు.

మన చుట్టూ ఉండే ఫ్యాబ్ర‌క్ సామాజం తాలూకా బ‌లాబలాలు..సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించే లేదా ప్రోత్సహించే స్పేస్ ఇది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అర్థవంతమైన, ప్రామాణికమైన, సార్వత్రికమైన కథలను చెప్పడానికి ఒక వేదిక ఇది అని స‌మంత వెల్ల‌డించారు.

న‌టిగా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి చిత్రం చివరిగా పెద్ద స్క్రీన్‌లో విడుదలైంది. ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. తదుపరి ప్రైమ్ వీడియో సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్ సరసన స‌మంత‌ కనిపించనుంది.

Tags:    

Similar News