ఘనంగా మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్.. బేబీ బంప్ తో సామ్ సందడి!
ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటు జియో హాట్ స్టార్ వేదికగా ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. అందం, అభినయంతో.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. గత మూడేళ్ల క్రితం తెలుగులో 'ఖుషి' సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఈమె.. ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా.. అమెరికాలో చికిత్స కూడా తీసుకుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో సమంత మళ్లీ యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. అలాంటి ఈమె తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్ లో తొలిసారి 100 కోట్లకు క్లబ్లో చేరిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ..
తన భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కం డైరెక్టర్ రాజ్ కథను అందిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ మూవీ ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరడం ఇదే మొదటిసారి. అలా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది సమంత. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇటు జియో హాట్ స్టార్ వేదికగా ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్..
ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ తొలిసారి 100 కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా మా ఇంటి బంగారం చిత్ర బృందం చాలా గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా సమంత తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకుంది.ఇకపోతే తాజాగా జరుపుకున్న ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో సమంత రెడ్ అండ్ పింక్ కలర్ అనర్కలి డ్రెస్ ధరించి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఈమె భర్త రాజ్ నిడిమోరు కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగం పంచుకున్నారు.
స్పెషల్ అట్రాక్షన్ గా సమంత..
మరోవైపు సమంత రెడ్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం గర్భం దాల్చిన కారణంగా కొంతకాలం మెటర్నటీ లీవ్ తీసుకుంటానని, ఆ తర్వాత మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పిన ఈమె.. మరోవైపు కోలీవుడ్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ.. అటు నిర్మాత గా కూడా సక్సెస్ అయింది.