జ‌నాల‌తో మ‌ళ్లీ థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌!

కేవలం స్టార్ హీరోల మీదనే ఆధారపడకుండా కథలో ఉండాల్సిన డెప్త్ .. ప్రొడక్షన్ వాల్యూస్ పట్ల నిర్మాతలు మరింత శ్రద్ధ వహిస్తున్నారు.

Update: 2026-07-12 09:00 GMT

ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల హవా పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందనే ఆందోళన టాలీవుడ్ నిర్మాతల్లో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది . ఇంటి వద్దే వినోదం దొరుకుతుండటంతో థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందన్నది అంతే వాస్త‌వంగా వెలుగులోకి వ‌స్తోంది . అయితే `మా ఇంటి బంగారం`, `లెనిన్` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న విజయాలు ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాయి. ప్రేక్షకులు ఇప్పటికీ గొప్ప అనుభూతిని కోరుకుంటున్నారని సరైన కంటెంట్ ఉంటే థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ రెండు సినిమాలు మ‌రోసారి నిరూపించాయి.

సమంత స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కించిన `మా ఇంటి బంగారం` చిత్రం లేడీ-ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా విజయం కేవ‌లం యాక్షన్ .. భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా కథాబలం ఉన్న సినిమాలకు కూడా థియేటర్లలో ఎంతటి ఆదరణ ఉంటుందో? నిరూపించింది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన `లెనిన్` మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.

క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లు, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం అఖిల్ కెరీర్‌లో సాలిడ్ కంబ్యాక్‌గా నిలిచింది. మాస్ ఎలి మెంట్స్‌తో పాటు కమర్షియల్ హంగులు జతచేయడం వల్ల సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఇలా వరుస విజయాలు టాలీవుడ్ మేకర్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మల్టీప్లెక్స్ నుండి సింగిల్ స్క్రీన్ వరకు ప్రేక్షకులను అలరించడానికి ఏ విధమైన కథాంశాలు అవసరమో? అర్థం చేసుకోవడానికి ఈ విజయాలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

కేవలం స్టార్ హీరోల మీదనే ఆధారపడకుండా కథలో ఉండాల్సిన డెప్త్ .. ప్రొడక్షన్ వాల్యూస్ పట్ల నిర్మాతలు మరింత శ్రద్ధ వహిస్తున్నారు. థియేటర్ల వద్ద జనం క్యూ కడుతుండటం అనేది టాలీవుడ్ పరిశ్రమకు ఆర్థికంగానే కాకుండా కళాత్మకంగా కూడా మంచి సంకేతం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుండటంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో కూడా మేకర్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే మ్యాజిక్ను తాము పట్టుకున్నామని భావించడం పరిశ్రమలో పెరిగిన ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది.

ఓటిటిల పోటీని తట్టుకుని థియేటర్లు మళ్లీ కళకళలాడుతుండటం శుభపరిణామం. `మా ఇంటి బంగారం`, `లెనిన్` వంటి సినిమాలు కేవలం వినోదాన్ని మాత్ర‌మే కాకుండా పెద్ద తెరపై సినిమాను చూసే అనుభూతిని మళ్ళీ ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యభరితమైన చిత్రాలతో ఈ జోరు కొనసాగుతుందని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News