సంచ‌ల‌న ప్రాంచైజీ నుంచి మూడ‌వ సినిమా!

ఈ నేప‌థ్యంలో పార్ట్ 3పై నిర్మా త ఆంటోనీ పెరుంబవూర్ కీలక ప్రకటన చేశారు. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా ఉంటుందని.. `లూసిఫర్ 3` ఖచ్చితంగా తీస్తామని ప్ర‌క‌టించారు.

Update: 2026-09-09 16:30 GMT

మలయాళ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన `లూసిఫర్` ఫ్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు భాగాలు 400 కోట్ల వ‌సూళ్ల‌తో ప్రాంచైజీ చిత్రాల్లో రికార్డు సృష్టించింది. లూసిఫ‌ర్ ని తెలుగులో సైతం గాడ్ ఫాద‌ర్ టైటిల్ తో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో `లూసీఫ‌ర్ 3` కోసం మాలీవుడ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్ట్ 3పై నిర్మా త ఆంటోనీ పెరుంబవూర్ కీలక ప్రకటన చేశారు. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా ఉంటుందని.. `లూసిఫర్ 3` ఖచ్చితంగా తీస్తామని ప్ర‌క‌టించారు.

లూసిఫర్` చిత్రాన్ని తొలి నుంచే విస్తృతమైన ఫ్రాంచైజీగా ప్లాన్ చేశామని తెలిపారు. ఈ కథను ఒక భాగంతో ముగించడం సాధ్యం కాదని.. అందుకే రెండవ భాగమైన `ఎంపురాన్` తర్వాత ఖచ్చితంగా `లూసిఫర్ 3` రాబోతోందని వెల్లడించారు. ఈ వార్తతో మోహన్‌లాల్ అభిమానులు .. మలయాళ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు భాగాల విజయాలు మోహన్‌లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే మూడో భాగం కూడా ఉంటుందని అధికారికంగా ప్రకటించడం తో ఈ ట్రైలజీ ని మరింత భారీ స్థాయిలో నిర్మించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

`లూసిఫర్` వరల్డ్‌లో ఇంకా చెప్పాల్సిన కీలక ఘట్టాలు మిగిలి ఉండటమే మూడో భాగ నిర్మాణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. `స్టీఫెన్ నెడుంపల్లి` అలియాస్ `అబ్రామ్ ఖురేషి` పాత్ర చుట్టూ అల్లిన రాజకీయ ప్రతీకారం, అంతర్జాతీయ మాఫియా నెట్‌వర్క్ ఎలిమెంట్స్ మూడో భాగంలో మరింత ఉత్కంఠభరితంగా సాగ‌నున్నాయి.

రచయిత మురళీ గోపి డిజైన్ చేసిన కథాంశం చివరి ఘట్టానికి చేర‌డంతో? మూడో భాగంలో అత్యంత కీలకమైన మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ సాంకేతిక నైపుణ్యం, విజువల్ గ్రాండియర్‌తో మలయాళ చిత్రపరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లారు. మొదటి రెండు చిత్రాల్లో ఆయన చూపించిన టేకింగ్, లార్జర్ దాన్ లైఫ్ కథనం ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాయి. తాజాగా రాబోయే చివరి భాగం మొత్తం సిరీస్‌కే మైలురాయిగా నిలిచేలా.. మార్వెల్ తరహా లో ఓ పెద్ద సినిమాటిక్ యూనివర్స్ ముగింపుగా ఉండబోతోందని అంచ‌నా వేస్తున్నారు.

మ‌ల‌యాళ‌ పరిశ్రమలో ఒక‌ ప్రాంచైజీ విజయవంతంగా వరుసగా మూడు భాగాల వరకు వెళ్లడం అనేది సాధారణ విషయం కాదు. ప్రాంతీయ పరిమితులను దాటి మలయాళ సినిమా సాధించిన మార్కెట్ విస్తరణకు ఈ ఫ్రాంచైజీ ప్రత్యక్ష నిదర్శనం. ఆంటోనీ పెరుంబవూర్ అందించిన కొత్త అప్‌డేట్ మాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు ఓ కొత్త బెంచ్ మార్క్‌ను నిర్దే శిస్తోంది. ఇంత‌కాలం చిన్న ప‌రిశ్ర‌మ‌..అవార్డు చిత్రాల‌కే ప‌రిమితం అవుతుంది అన్న వాద‌న నుంచి క‌మ‌ర్శియ‌ల్ కంటెంట్ తో ఓ క‌థ‌ను తెర‌కెక్కిస్తే? ఎంత బ‌లంగా చెబుతార‌న్నది అద్దం ప‌డుతుంది.

Tags:    

Similar News