• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతల న్యూ ట్రాక్.....

నిర్మాతల న్యూ ట్రాక్.. పెద్ద సినిమాలకంటే ఈ ప్లాన్ బెటర్!

| గతంలో బడా నిర్మాతలు ఎక్కువగా పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతుండగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

By - Tupaki Desk
Update: 2025-01-30 00:30 GMT

టాలీవుడ్‌లో సినిమాల వర్గీకరణ బడ్జెట్‌ను ఆధారంగా చేసుకొని జరుగుతుంది. చిన్న సినిమాలు పరిశ్రమకు బలమైన వృద్ధిని అందిస్తే, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాయి. కానీ గత కొంతకాలంగా, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే ఇండస్ట్రీలో మరింత ప్రాధాన్యత పొందుతున్నాయి. గతంలో బడా నిర్మాతలు ఎక్కువగా పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతుండగా, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ పెట్టి ఒకే ఒక సినిమాను తీయడం కన్నా, అదే ఖర్చుతో రెండు మూడు మిడ్ రేంజ్ సినిమాలు తీస్తే లాభాలు ఎక్కువగా వస్తాయని అర్థం చేసుకున్నారు.

ఈ ట్రెండ్‌ను బలపరిచిన స్టూడియోలలో సితార ఎంటర్టైన్‌మెంట్స్ ముందు వరుసలో ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాల్లో 90 శాతం మిడ్ రేంజ్ చిత్రాలే. అయితే అవే మంచి వసూళ్లు సాధించి, సితారను టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. మ్యాడ్, టిల్లు, టిల్లు స్క్వేర్, సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు కమర్షియల్‌గా బాగా ఆడటంతో, నాగ వంశీ ఈ ఫార్ములా ద్వారా మరిన్ని లాభాలను అందుకున్నారు. ఇప్పుడీ సంస్థ నుంచి ఒక పెద్ద సినిమా వస్తే, అదే బ్యాలెన్స్ చేయడానికి నాలుగు మీడియం బడ్జెట్ సినిమాలు లైన్‌లో ఉంటున్నాయి.

ఇక టాలీవుడ్‌లో మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదే దారిలో అడుగుపెట్టాడు. ఈ సంక్రాంతికి ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఏకంగా 100 కోట్ల వరకు దెబ్బ కొట్టింది. కానీ అంచనాలు లేకుండా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహించని వసూళ్లను రాబట్టి, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాంతో 100 కోట్ల నష్టం ఈ సినిమాతో రికవరీ అయ్యింది. దిల్ రాజు కూడా పెద్ద సినిమాల కంటే, మిడ్-రేంజ్ సినిమాలే మంచివని భావనకు వచ్చి, దాని పైనే ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

కేవలం సితార, దిల్ రాజు మాత్రమే కాదు, ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఇదే దిశగా ప్రయాణం మొదలుపెట్టాయి. డివివి దానయ్య, బివిఎస్ఎన్ ప్రసాద్ వంటి ప్రముఖ నిర్మాతలు కూడా ఇప్పుడు ఎక్కువగా మీడియం బడ్జెట్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడం కంటే, మిడిల్ రేంజ్ సినిమాల ద్వారా మంచి మార్కెట్‌తో పాటు, తక్కువ రిస్క్‌లో లాభాలను పొందొచ్చని అనుభవంతో అర్థం చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ మారుతున్న ట్రెండ్ వల్ల టైర్ 2 హీరోలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారిపోయింది. మధ్యస్థాయి కథలను సరిగ్గా ప్రెజెంట్ చేస్తే, థియేటర్లలో కూడా మంచి వసూళ్లు రాబట్టవచ్చని నిర్మాతలు నమ్ముతున్నారు. ముఖ్యంగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ వంటి సంస్థలు కూడా తమ కదలికలను దీనికనుగుణంగా మార్చుకుంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే, టాలీవుడ్‌లో వచ్చే కాలంలో మరింత ఎక్కువగా మిడ్ రేంజ్ సినిమాల హవా కనిపించేలా ఉంది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Telugumovies 
  • MediumBudgetFilms 
  • Sitharaentertainments 
  • Dilraju 
  • Commericalsuccess 
  • Markettrends 
  • Collections 
  • Starproducers 
  • Boxoffice 
  • Boxofficelosses 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS