• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దెయ్యంతో ప్రేమ వెరీ...

దెయ్యంతో ప్రేమ వెరీ ఇంట్రెస్టింగ్..!

| ఈ సినిమా దెయ్యంతో ప్రేమకథ అని తెలుస్తుంది. మోషన్ పోస్టర్ తో పాటుగా లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు.

By - Tupaki Desk
Update: 2024-03-08 05:03 GMT

ఓ పక్క పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఊగిపోయే సినిమాలతో స్టార్ హీరోలంతా కూడా సత్తా చాటుతుంటే వారికి ఏమాత్రం తగ్గకుండా కొత్త కథ కథనాలతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తున్నారు కొత్త దర్శకులు. అందులో భాగంగా ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేసో.. యాక్షన్ తో మెప్పించో.. ఎంటర్టైన్ చేసో ఆఖరికి భయపెట్టో ఏదో ఒకలా సినిమాను హిట్ చేసుకుంటున్నారు. ప్రేక్షకుడికి నచ్చిన సినిమా అది ఎంత బడ్జెట్.. అందులో ఏ స్టార్ ఉన్నది అనవసరం. సో అలా ప్రస్తుతం టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి ట్రెండ్ నడుస్తుంది.

అలాంటి మరో సరికొత్త ప్రయత్నం తో వస్తున్నాడు దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డి. రౌడీ బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన అతను సెకండ్ మూవీ సెల్ఫిష్ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత లవ్ మీ అంటూ ఓ సరికొత్త కథతో వస్తున్నాడు. నూతన దర్శకుడు అరుణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దెయ్యంతో ప్రేమకథ అని తెలుస్తుంది. మోషన్ పోస్టర్ తో పాటుగా లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు.

ఈ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఆర్య విన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఈ సినిమా కథ విన్నప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ఆశిష్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ.. ఇలాంటి కథాంశంతో ఇదివరకు ఏ సినిమా రాలేదు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కీరవాణి మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు దిల్ రాజు. వైష్ణవి లేకుంటే ఈ సినిమా ఇంత ఎంజాయ్ చేసే వాళ్లం కాదని అన్నారు.

ఇక సినిమా గురించి నేను మాట్లాడే దాని కన్నా నా సినిమా మాట్లాడాలని అనుకుంటున్నా అంటూ డైరెక్టర్ అరుణ్ అన్నారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ దెయ్యమని తెలిసి ఈ సినిమాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ తర్వాత ఏమైంది అన్నది ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. ఇదొక థ్రిల్లర్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఈ సినిమా చూస్తున్నప్పుడు కచ్చితంగా షాక్ అవుతారు.. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తారని హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు.

Full View
Tags:    
  • Ashish 
  • Vaishnavichaitanya 
  • Dilraju 
  • Loveme 
  • Arunbhimavarapu 
  • Mmkeeravani 
  • Lovestory 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS